Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీర్ హెల్త్ డ్రింకా..? అమ్మాయిలను కూడా తాగమంటారా? ఎర్రచందనాన్ని అమ్మే హెరిటేజ్‌ను?: రోజా

మంగళవారం, 4 జులై 2017 (14:48 IST)

Widgets Magazine
rk roja

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎర్రచందనాన్ని అమ్మే హెరిటేజ్‌ను అభివృద్ధి చేశారా? అంటూ ప్రశ్నించారు. హెరిటేజ్ వ్యానులో ఎర్రచందనం దుంగలు వెళ్తున్నాయి రోజా ధ్వజమెత్తారు. నారావారిపల్లెలో ఉన్న చంద్రబాబు పొలంలో కూడా ఎర్రచందనం దుంగలు దొరికాయని విమర్శించారు. 
 
ఇక బీర్‌ను హెల్త్ డ్రింక్ అంటూ ఏపీ మంత్రి జవహర్ చేసిన వ్యాఖ్యలను రోజా తప్పుబట్టారు. బీర్ హెల్త్ డ్రింక్ అంటూ మంత్రులు కామెంట్లు చేస్తుంటే.. ప్రభుత్వం ఇక రానున్న రోజుల్లో విద్యార్థులతో బీర్ తాగించేలా ఉన్నారని మండిపడ్డారు. అంతేగాకుండా అమ్మాయిలను కూడా మందు తాగమంటారా అంటూ ప్రశ్నించారు. స్కూళ్లు, గుళ్ల మధ్య వైన్ షాపులను వైసీపీ అంగీకరించదని తెలిపారు. మంత్రి జవహర్ తక్షణం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. 
 
ఇదిలా ఉంటే.. ఏపీ ఎక్స్‌జ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీరును హెల్త్ పానీయం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఏపీ నూతన మద్యం పాలసీని ప్రవేశపెడుతూ.. బీరును సంప్రదాయ హెల్త్ డ్రింక్ అనేలా ప్రచారం చేస్తామన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీరులో ఆల్కహాల్ వుంటుందని.. బీరు వల్ల బెల్లీ ఫాట్ పెరుగుతుంది, షుగర్ లెవల్స్ పెరుగుతాయని.. అలాంటప్పుడు అదెలా హెల్త్ డ్రింక్ అవుతుందని నెటిజన్లు సైతం జవహర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'అంగన్‌వాడీ టీచర్‌గా ఉద్యోగం ఇప్పించా.. మరి నా సంగతేంటి' : సర్పంచ్‌ భర్తకు చెప్పుదెబ్బలు

ఓ గ్రామ సర్పంచ్‌కు చెప్పుదెబ్బలు పడ్డాయి. టీచర్ ఉద్యోగం ఇప్పించినందుకు బహుమతిగా తన కోర్కె ...

news

రామోజీరావు ఇంట పెళ్లి సందడి... తరలిరానున్న ప్రముఖులు...

ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి సీహెచ్. రామోజీరావు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద ...

news

గుడ్ వర్క్‌కు దక్కిన రివార్డు... వెలుగునిచ్చే దీపానికి సొంతిల్లు ఉండదు ... బదిలీపై శ్రేష్టా ఠాకూర్

నిజాయితీగా విధులు నిర్వహించినందుకు డీఎస్పీ శ్రేష్టా ఠాకూర్ అధికారిణికి ఉత్తరప్రదేశ్ ...

news

అన్నే కాటేశాడు... చెల్లిని వంచించి గర్భవతిని చేశాడు... ఎక్కడ?

కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్న కాటేశాడు. సభ్యసమాజం తలదించుకునే పాడుపనికి పాల్పడ్డాడు. ...

Widgets Magazine