బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (07:57 IST)

వైసీపీ వాళ్లకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి: జ్యోతుల నెహ్రూ

వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆమ్మఒడి పథకం పెద్ద మోసం, దగా అని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు.

సీఎం జగన్ తీసుకున్న విధానాలతో విద్యావ్యవస్థ పూర్తిగా సంక్షోభoలో పడిందన్నారు. అంగన్‌వాడి కేంద్రంలో పిల్లలకు పాలు కూడ సక్రమంగా అందించడంలేదని ఆరోపించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నవారికే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్లు తిరిగి ఇవ్వకపోతే కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు ఇస్తామని జ్యోతుల నెహ్రూ హెచ్చరించారు.