గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (19:21 IST)

సూళ్లూరుపేట కోళ్లమిట్ట సెంటర్లో కుర్రాళ్లు షటిల్ ఆట కత్తిపోట్లకు దారితీసింది

సూళ్లూరుపేట కోళ్లమిట్ట సెంటర్లో రాత్రి 10 గంటలకు షటిల్ ఆడుతున్నసమయంల చోటుచేసుకొన్న ఓ వివాదం హింసగా మారింది. ఓ యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి చంపారు. ప్రాధమిక సమాచారం మేరకు 10 మంది వ్యక్తులు షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతున్న సమయంలో అనిల్ కుమార్, మణికంఠ అనే ఇద్దరు వ్యక్తులతో పవన్, సాయి అనే యువకులు ఘర్షణకు దిగారు.
 
దూషణల క్రమంలో హఠాత్తుగా సమీపంలోని ఇంటి వద్ద నుండి తీసుకొచ్చిన కత్తితో అనిల్ కుమార్ అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేసారు. మరో యువకుడు మణికంఠకు తీవ్రగాయాలైనాయి. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకొని సమీప హాస్పిటల్‌కు తరలించారు.