మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 డిశెంబరు 2020 (09:56 IST)

మీ కూతురు ఆత్మహత్య చేసుకుంది, ఎందుకో నాకు తెలియదు: అమెరికా అల్లుడు సమాధానం

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
అమెరికాలోని న్యూజెర్సీలో చిత్తూరు జిల్లా వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నదని అమెరికా నుంచి అల్లుడు మెసేజ్ పెట్టాడు. ఎందుకు అని అడిగితే, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదో నాకు తెలియదు అని సమాధానం ఇచ్చి ఫోన్ కట్ చేసేసాడు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలానికి చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తెకు పల్లయ్యగారి పల్లెకు చెందిన సుధాకర్ నాయుడుతో 2016లో వివాహం జరిగింది. 2017లో వీరు అమెరికా వెళ్లారు. అప్పట్నుంచి న్యూజెర్సీలోనే వుంటున్నారు. వీరికి రెండున్నరేళ్ల బాబు కూడా వున్నాడు. ఐతే మంగళవారం నాడు త్యాగరాజులు నాయుడుకి మెసేజ్ వచ్చింది. అందులో వున్న సారాంశం చూసి ఆయన షాక్ తిన్నాడు. తన కుమార్తె సూసైడ్ చేసుకుందని అల్లుడు పంపిన సందేశం అది.
 
ఇలా ఎందుకు జరిగింది బాబూ అని అడిగితే... అవన్నీ నాకు తెలియదు. ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పాడు. కుమార్తె మృతదేహాన్ని ఇండియాకు పంపమని అడిగితే... అవన్నీ కుదిరే పని కాదంటూ తేల్చేశాడు. దీనితో త్యాగరాజులు నాయుడు తన కుమార్తెను అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చెపుతున్నాడని జిల్లా కలెక్టరుకి ఫిర్యాదు చేసాడు. తన కుమార్తె మృతదేహాన్ని చిత్తూరుకు రప్పించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేసారు.