గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2024 (19:00 IST)

పాపం మీ అమ్మగారు పొద్దున్నే లేచి మీకోసం..: విద్యార్థులతో డిప్యూటీ సీఎం పవన్ (video)

pawan kalyan
Pawan Kalyan inspirational speech with students: ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశంలో మాట్లాడుతూ.... నా తల్లి హీరో నాకు, నా తండ్రి నాకు హీరో. ఎందుకంటే మాకోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. అలా మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కష్టపడుతున్నారు. పాపం మీ అమ్మగారు పొద్దున్నే లేచి మీకోసం టిఫిన్ చేసి, మధ్యాహ్నం మీరు వస్తే మీరు ఏదయినా తింటారని ఏదో ఒకటి తయారు చేస్తారు. వాళ్ల కష్టాన్ని విద్యార్థులైన మీరు వారి చిన్నపాటి బరువును తగ్గిస్తే చాలు. అలాగే ఉపాధ్యాయుల కష్టాన్ని తగ్గిస్తే చాలు.'' అంటూ బాలబాలికలకు స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు.
 
ఉపాధ్యాయులకు దేశంలోనే అధికమైన వేతనం ఇవ్వాలి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం నాడు కడప(Kadapa) మునిసిపల్ హైస్కూలు విద్యార్థినీవిద్యార్థులతో ముచ్చటించారు. వారి సమస్యలను విన్నారు. అలాగే ఉపాధ్యాయుల చెప్పిన సమస్యలకు తక్షణ పరిష్కాలకు ఆదేశాలు జారీ చేసారు. మునిసిపల్ హైస్కూలులో కిచెన్ కోసం తన సొంద నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు.
 
అనంతరం అధ్యాపకులు, విద్యార్థినీవిద్యార్థులతో మాట్లాడుతూ... మన ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరుముగ్గురు పిల్లలని సముదాయించేందుకే ఎంతో కష్టపడిపోతుంటారు. అలాంటిది ఒక క్లాసుకి 30 మంది విద్యార్థినీవిద్యార్థులను కూర్చోబెట్టి వారికి పాఠాలను బోధించడం మాటలు కాదు. అధ్యాపకులు ఎంతో కష్టపడుతుంటారు. వారి కష్టానికి ప్రతిఫలంగా దేశంలోనే అత్యధిక జీతం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.
 
ఇది జరుగుతుందో లేదో తెలియదు కానీ నావంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. అధ్యాపకులు నిరంతరం పిల్లలకు పాఠాలు చెబుతూ వారికి క్రమశిక్షణ నేర్పుతారు. వారి బోధనలతోనే పటిష్టమైన సమాజం ఏర్పడుతుంది. నిరంతరం పిల్లలకు పాఠాలు చెప్పే అధ్యాపకులకు పోషకాహారం కూడా అవసరం. ఎందుకుంటే వారు అలసిపోతుంటారు. వారికి బాలబాలికలకు ఎలా మధ్యాహ్న భోజనం అందిస్తున్నామో అలాగే అధ్యాపకులకు కూడా పోషకాహారం అందించే ప్రయత్నం జరగాలి'' అని వెల్లడించారు.