1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 12 జులై 2025 (12:50 IST)

యువకుడు దారుణ హత్య: కాళహస్తి జనసేన ఇన్‌చార్జి కోట వినుత బహిష్కరణ

vinotha kota
శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్ చార్జి కోట వినుతను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జనసేన ఓ ప్రకటనలో తెలియజేసింది. చైన్నై నగరంలో కూవం నదిలో కాళహస్తికి చెందిన రాయుడు అనే యువకుడు శవమై తేలాడు. ఇతడిని ఐదుగురు వ్యక్తులు చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి నదిలో పడవేసినట్లు వార్తలు వచ్చాయి. ఐతే ఈ నిందితుల్లో శ్రీకాళహస్తికి చెందిన జనసేన ఇంచార్జి వినుత, ఆమె భర్త చంద్రబాబు కూడా వున్నారంటూ వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
రాయుడు హత్య కేసులో చెన్నై పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసారు. వారిలో వినుత, చంద్రబాబు, శివకుమార్, గోపి, దాసర్ అనే ఐదుగురు వున్నారు. సీసీటీవి ఫుటేజిలో వీళ్లంతా అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.