Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అన్నం పెట్టే రైతును ఆదుకుంటామన్న జగన్.. హామీలు ఒకే కాని డబ్బుల మాటేమిటి?

హైదరాబాద్, సోమవారం, 10 జులై 2017 (06:16 IST)

Widgets Magazine
Jagan

వచ్చే ఎన్నికల్లో అధికారం ఇస్తే రైతుల కంట నీరు లేకుండా చేస్తానని, రైతు సంక్షేమమే లక్ష్యంగా చేసుకుంటానని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో జరిగిన పార్టీ 3వ జాతీయ ప్లీనరీ సభ ముగింపు రోజున.. నవ్యాంద్ర భవిష్యత్తుకు నవరత్నాల్లాంటి పథకాలు అంటూ జగన్ ప్రకటించిన హామీలు, వాటికయ్యే ఖర్చు వివరాల వెల్లడి చూస్తుంటే వాటి ఆచరణ సాధ్యాసాధ్యాలు అలా పక్కన బెడితే వింటున్న వారి కళ్లు బైర్లు కమ్ముతున్నాయంటే అతిశయోక్తి కాదు. 
 
కష్టకాలంలో ఉన్న రైతన్నను ఆదుకునేలా రైతు భరోసా పథకాన్ని, డ్వాక్రా, పొదుపు సంఘాలకు తిరిగి జవసత్వాలు తీసుకువచ్చేలా వైస్సార్‌ ఆసరా పథకాన్ని, వేయి రూపాయల పింఛన్‌ను రెండు వేలకు పెంపు, ఒకటి నుంచి పది వరకు బిడ్డలను చదివించే తల్లులకు ఆర్థిక సాయం అందించేందుకు అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామన్నరాు. అందరికీ ఆరోగ్యం పంచేలా ఆరోగ్య శ్రీ,, పేద విద్యార్థులు పెద్ద చదువులు చదివేందుకు ఉపకరించే మరింత మెరుగైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం, సాగునీటి కోసం జలయజ్ఞం, మద్యపానాన్ని పారదోలేందుకు దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 
 
నవరత్నాల్లాంటి పథకాలు సరే.. వీటన్నింటికీ డబ్బులో..?
 
ప్లీనరీలో జగన్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. వచ్చే ఎన్నికలకు ఇప్పుడే హామీలు ఇచ్చారు. ఇవీ ఆ హామీలు...
అధికారంలోకి రాగానే ఐదెకరాల్లోపు భూము లున్న రైతులకు 50 వేల నగదు.
ఏటా మే నెలలో ఎరువులు, విత్తనాల కోసం రూ.12,500 చెల్లింపు. రైతులకు వడ్డీ లేని, పావలా వడ్డీ రుణాలు. రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయక నిధి. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
డ్వాక్రా మహిళలకు ‘ఆసరా’. రుణాల చెల్లింపు.
వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్‌ 2 వేలు.
పిల్లల చదువుల కోసం ‘అమ్మ ఒడి’ కార్యక్రమం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ప్రాథమిక విద్య వరకు ప్రతి నెలా రూ.500, ఆరు నుంచి పదో తరగతి వరకు రూ. 750, ఇంటర్మీడియట్‌లో నెలకు రూ.1000 చొప్పున కుటుంబానికి ఇద్దరికి చెల్లింపు.
25 లక్షల ఇళ్లు నిర్మాణం. మహిళల పేరిట కేటాయింపు.
ఆరోగ్యశ్రీ లో ఆపరేషన్‌ చేయించుకొన్న వ్యక్తి బెడ్‌రెస్టు తీసుకోవాల్సి వస్తే ప్రతీ నెలా పరిహారం. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పెన్షన్‌.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద మొత్తం ఫీ జు చెల్లింపు. ఏటా విద్యార్థికి హాస్టల్‌, భోజన ఖర్చులు నిమి త్తం 20 వేలు అదనం!
మూడు దశల్లో మద్య నిషేధం! మొదటి దశలో దుకాణాలను తగ్గిస్తూ బెల్టుషాపులపై ఉక్కుపాదం. రెండో దశలో... మద్యాన్ని నిషేదంపై కేంద్రానికి వినతి. మూ డో దశలో కోటీశ్వరులు మాత్రమే మద్యం తాగే లా ధరలు పెంపు. మద్యం తయారు చేసినా, అమ్మినా ఏడేళ్ల శిక్ష పడేలా చట్ట సవరణ.
 
కానీ చంద్రబాబు ఇప్పటికే హామీలు గుప్పించి ఏదీ నెరవేర్చలేక ప్రజలను మోసం చేశారంటున్న వైకాపా ఇప్పుడు ప్రభుత్వ ఖజానాపై భారీ ఖర్చు మోపగల ఈ పథకాలు ప్రకటించటం చూస్తే వీటికయ్యే డబ్బులెక్కడినుంచి తెస్తారన్నది అర్థం కావడం లేదు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఒక్క మదనపల్లిలో టమాటా పండకపోతే తెలంగాణ మొత్తం అల్లాడిపోతోంది. ఎన్నాళ్లీలా?

తెలంగాణలో టమాటా ధర ఇప్పుడు ప్రజలకు మంటెక్కిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. కిలో టమాటా ...

news

పాక్ తరపున కశ్మీర్‌లోకి మూడో దేశం సైన్యం ప్రవేశించవచ్చు.. చైనా తర్కం తగలడినట్లే ఉంది

పాకిస్తాన్ తరపున కశ్మీర్‌లోకి మూడో దేశం సైన్యం ప్రవేశించే అవకాశం కొట్టిపారేయలేమని చైనా ...

news

ఇక అమెరికాలో మనం సులువుగా ప్రవేశించవచ్చు.. గ్లోబల్ ఎంట్రీలో మనమూ భాగం

ఎట్టకేలకు భారతీయ ప్రయాణికులకు అమెరికా కాస్త వెసులుబాటు నిచ్చింది. ఇతర దేశాల పౌరులు ఎక్కువ ...

news

లక్ష డాలర్లు ఉన్నాయంటే చాలు. భర్తనయినా చంపేస్తారు... అమెరికాలోనూ అదే బతుకే.. థూ..!

ఆస్తి మీద చూపు పడితే భర్తలేదు, భార్య లేదు, బిడ్డల్లేదు.. మనుషులను నిలువునా పాతిపెట్టేసి ...

Widgets Magazine