సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (14:00 IST)

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఓవర్..

jagan
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన జగన్ శనివారం ఉదయం అమరావతికి బయల్దేరారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. 
 
ప్రధాని మోదీని కలుస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ అది జరగలేదు. గురువారం ఢిల్లీకి వెళ్లిన జగన్ తొలుత ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, ఆ తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో జగన్ భేటీ అయ్యారు. 
 
అలాగే శుక్రవారం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో జగన్ పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్ క్రమంలో జగన్ ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో  కీలకంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ పాత్ర వుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.