మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (13:05 IST)

నాకు రూ.43కోట్ల ఆస్తులున్నట్లు నిరూపిస్తే.. టీడీపీకే రాసిచ్చేస్తా!:జగన్ సవాల్.. నోరు జారిన బాబు

తనపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలను జగన్ ధీటుగా సమాధానమిచ్చారు. తాను వేలాది కోట్ల రూపాయాలను సంపాదించానని టిడిపి సభ్యులు ఆరోపణలు చేస్తున్నారని, టిడిపి సభ్యులు చెబుతున్నట్టుగా తనకు ఆస్తులున్నట్లు న

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ-వైకాపాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అసెంబ్లీ పాయింట్ వద్ద మైకుల వద్ద పోటీపడిన వైకాపా, టీడీపీ సభ్యులు.. అసెంబ్లీలో మాటల యుద్ధానికి తెరలేపారు. పవర్ ప్రాజెక్టుల విషయంలో టీడీపీ సర్కారు అవినీతిని పాల్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై.. మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. 
 
రూ.43కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని.. అలాంటి జగన్మోహన్ రెడ్డి అవినితీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేలాది కోట్ల రూపాయాలను జగన్ సంపాదించాడని అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు. ఐదేళ్ళలో వేలాది కోట్ల రూపాయలు జగన్ కు ఎలా వచ్చాయో చెప్పాలని ఆయన జగన్‌ను ప్రశ్నించారు. 
 
హైదరాబాద్‌లో లోటస్ పాండ్, బెంగళూరులో ఆస్తులు జగన్‌కు ఎలా వచ్చాయో చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పాదాభివందనం చేసి జగన్ బెయిల్ తెచ్చుకున్నారని జగన్‌‍పై విరుచుకుపడ్డారు. 
 
అయితే తనపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలను జగన్ ధీటుగా సమాధానమిచ్చారు. తాను వేలాది కోట్ల రూపాయాలను సంపాదించానని టిడిపి సభ్యులు ఆరోపణలు చేస్తున్నారని, టిడిపి సభ్యులు చెబుతున్నట్టుగా తనకు ఆస్తులున్నట్లు నిరూపిస్తే.. రూ.43వేల కోట్లలో పది శాతం తాను తీసుకుని.. మిగిలిన ఆస్తులన్నీ టీడీపీకే రాసిస్తానని జగన్ సవాల్ విసిరారు. ఈ మేరకు ఎక్కడ సంతకాలు పెట్టమంటే సంతకాలు పెడతానని జగన్ ఆవేశంగా చెప్పారు.
 
తాను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాతే తనపై కేసులు బనాయించారని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై టిడిపి ఈ కేసులను వేయించిందని జగన్ విమర్శించారు. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు ఎర్రన్నాయుడు ఈ కేసు వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్ బతికున్నంత కాలం పాటు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం మంచి వాళ్ళుగా కనిపించామని.. పార్టీ మారిపోగానే చెడ్డవాళ్లుగా మారిపోయామా అంటూ ప్రశ్నించారు. 
 
పార్టీ మారగానే జగన్ అవినీతిపరుడిగా ఎలా అయ్యాడని అధికార పార్టీని ప్రశ్నించారు. తనపై 11 చార్జీషీట్లలో 1200 కోట్ల రూపాయాలు అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, ఇవి కూడ రుజువు కాలేదని జగన్ గుర్తు చేశారు.
 
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరు జారారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో అధికార- విపక్షాల మధ్య మాటల దాడి తీవ్రమైంది. ఈ క్రమంలో ప్రతిపక్షం లెవత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన సీఎం చంద్రబాబు, ఒకానొక సందర్భంగా ఆవేశంగా మాట్లాడుతూ నోరు జారారు. భారతదేశం మొత్తం మీద ఒక్కసారి చూస్తే అవినీతిలో గానీ అభివృద్ధిలో గానీ మొదటి స్థానంలో ఉన్నాం అన్నారు. విపక్షాలు సభను జరగనీయకుండా అడ్డుపడుతుంటే చంద్రబాబు ఒకింత టెన్షన్‌కు గురయ్యారు. దీంతో టెన్షన్‌లో నోరు జారారు.