మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ప్రీతి
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (18:20 IST)

పవన్ సభలో వైఎస్ జగన్ పేరు చెప్పిన రైతు.. అప్పుడు పవన్ ఏం చేసారో తెలుసా?

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ రెండో రోజు కర్నూలు జిల్లాలో పర్యటించారు. అధోని పత్తి మార్కెట్‌ యార్డులో రైతులతో ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేసారు పవన్ కళ్యాణ్. "ముందుగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను వచ్చింది రైతుల సమస్యలు వినడానికి, కనుక రైతుల కష్టాలను విందాం. రైతనే వాడు లేకపోతే భవిష్యత్తు లేదు" అంటూ అక్కడికి వచ్చిన ఓ రైతును మాట్లాడమన్నారు.
 
'కోతకు సిద్ధమైన పత్తిపంట వర్షం రావడంతో నానిపోయింది. దాని వలన పశువులను కూడా అమ్ముకున్నాను. పశువులు లేకపోతే ప్రపంచం లేదు, ఉద్యోగస్తులు లేరు’ అని రైతు తన గోడు వెళ్లబోసుకున్నాడు. వెంటనే ఆ రైతు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని గెలిపించాలి, అప్పుడు నేను ఆయన్ని ఎలాగైనా బతిమిలాడి రైతులకు ఏం కావాలో అవన్నీ ఇప్పిస్తానని ఎంతో ధీమాగా చెప్పారు. 
 
ఆయన మాటలు వినగానే ఆ సభకు వచ్చిన వారందరూ హర్షధ్వానాలు చేయగా, అక్కడే మైక్ పట్టుకుని ఉన్న పవన్ కళ్యాణ్‌ మొహం చిన్నబోయింది, అక్కడే ఉన్న నాదెండ్ల మనోహర్ తత్తరపాటుకు గురయ్యారు. ఇంక మైకు తీసేసినప్పటికీ ఆ రైతు మాట్లాడటం ఆపకపోవడంతో పవన్ వేరే రైతులను ఉద్దేశించి ఇంకెవరైనా మాట్లాడతారా అని టాపిక్ డైవర్ట్ చేశారు.