గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 మార్చి 2024 (15:40 IST)

గుట్టలను కొట్టడం.. పోర్టులను అమ్మడం.. భూములను మింగడం.. ఇదే విశాఖపై జగన్ విజన్ : షర్మిల ఫైర్

ys sharmila
తన సొంత అన్న, వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి వైజాగ్‌లో కాపురం పెడతానని, విశాఖలోనే మరోమారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని విశాఖ వేదికగా జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో జగన్ చెప్పారు. అలాగే, విజన్ వైజాగ్ పేరుతో ఓ డూక్యుమెంటరీని రిలీజ్ చేశారు. దీనిపై వైఎస్ షర్మిల తీవ స్థాయిలో మండిపడ్డారు. పరిపాలన రాజధానిలో పాలన మొదలుపెట్టడానికి ఇన్నాళ్లు ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. 
 
పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్ అంటూ మండిపడ్డారు. ఐటీ హిల్స్‌ నుంచి దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా జారుకోవడం మీ రోడ్ మ్యాప్ అని అన్నారు. ఆంధ్రుల తలమానికమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం అమ్మెస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించడం మీ విజన్ అంటూ దుయ్యబట్టారు. రైల్వే జోన్ పట్టాలు ఎక్కపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్ అని అన్నారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మేయడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైకాపా విజన్ అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇపుడు ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలకు తెరతీశారని ఆమె ఆరోపించారు.