గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (08:30 IST)

క్రైస్తవ మతసంప్రదాయంలో వైఎస్.షర్మిల కుమారుడి వివాహం

ys sharmila son
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, ప్రముఖ మత బోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ఘనంగా జరిగింది. పూర్తిగా క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి  వివాహం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్‌పూర్‌ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తమ కుమారుడి పెళ్లికి సంబంధించిన ఫోటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. చర్చిలో ఉంగరాలు మార్చుకునే సందర్భంలో తీసిన ఫోటోతో పాటు తన తండ్రి దివంగత వైఎస్ఆర్ ఫోటో వద్ద ఇరు కుటుంబాల సభ్యులు కలిసి దిగిన ఫోటోలను ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ys sharmila son
 
"ఓ తల్లిగా నా జీవితంలో ఇది మరొక సంతోషకరమైన ఘట్టం. వేచి చూసిన ఆ క్షణాలు ఎట్టకేలకు వచ్చాయి. సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడి అంతులేని ప్రేమ, కృప, సన్నహితుల దీవెనలు, శుక్షాకాంక్షలతో ఈ శుభకార్య ఘనంగా జరిగింది. నా బిడ్డ తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడాడు. కొన్ని అద్భుతమైన క్షణాలు ఎప్పటికీ పదిలాంగా ఉండిపోతాయి" అంటూ షర్మిల ట్వీట్ చేశారు. కాగా, ఈ వివాహానికి వైఎస్ షర్మిల అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతీ రెడ్డిలు మాత్రం దూరంగా ఉన్నారు. షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ మాత్రం ఈ వివాహానికి హాజరయ్యారు.