బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2024 (10:52 IST)

కృష్ణానది ఒడ్డున చంద్రబాబు ఇల్లు కూల్చేయాల్సిందే.. విజయ సాయిరెడ్డి

Vijaysai Reddy
కృష్ణానది ఒడ్డున ఇల్లు నిర్మించుకున్న ఏపీ సీఎం చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. ముందు చంద్రబాబు ఇల్లు కూల్చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సూచించారు.
 
'ఎక్స్‌' వేదికగా చంద్రబాబు ఉండవల్లి నివాసంపై విజయ సాయిరెడ్డి ప్రశ్నలు సంధించారు. "సీఎం చంద్రబాబే పర్యావరణపరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రివలెట్‌పై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతడికి ఎక్కడుంటుంది. అందువల్ల చంద్రబాబు నివసించే అక్రమ కట్టడం మొదట కూలగొట్టడం సముచితం." అంటూ విజయసాయిరెడ్డి అన్నారు. 
 
మున్సిపల్ శాఖ మంత్రి అయిన పి నారాయణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకమంతా సహకరించాల్సి ఉంది. జలాశయాలు, సముద్రపు తీరం వెంట అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలనుకున్న ఆయన మొదట కృష్ణానది సరిహద్దుపై అక్రమంగా చంద్రబాబు నాయుడు నిర్మించుకున్న ఇంటిని కూల్చేయాలి. చట్టం ఎవరికీ అతీతం కాదు. చివరకు చంద్రబాబుకు కూడా' అని విజయసాయి రెడ్డి తెలిపారు.