శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (11:40 IST)

అమరజీవి పొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాలి.. వైకాపా నేతల డిమాండ్

తెలుగు ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని పోరాడి, ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములకు భారతరత్నఇవ్వాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
 
నెల్లూరు నగరంలో శనివారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి నెల్లూరు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షడు ఎన్. ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ ఒకటో తేదినే నిర్ణయించాలని సీఎంను కోరారు. జూన్ 2వ తేదీన జరుపుకోవాలనే ఆయన నిర్ణయాన్ని తప్పుపట్టారు. అవతరణ దినోత్సవం విషయంలో మరోసారి ఆలోచించాలని మేకపాటి ఈ సందర్భంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
 
అనంతరం ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములకు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.