శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 10 జులై 2019 (17:19 IST)

శవం కనిపిస్తే రాజకీయమే, సిగ్గుతో తలదించుకో చంద్రబాబూ!: కేతిరెడ్డి ఫైర్

అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెలుగుదేశం పార్టీయే నాంది పలికిందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. 
 
అనంతపురం జిల్లాలో దాడులకు కారణం తెలుగుదేశం పార్టీయే కారణమని ఆరోపించారు. గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా బుద్ది రావడం లేదన్నారు. అనంతపురంలో శాంతిభద్రతలపై మాట్లాడటం సిగ్గుతో తలదించుకోవాలని హెచ్చరించారు. 
 
శవం కనిపిస్తే చాలు రాజకీయం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనంతపురం జిల్లాలో ఎన్నో దాడులు జరిగాయని హత్యలు జరిగాయని ఆరోపించారు. 
 
వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించడానికి ఒక్కసారి కూడా రాని చంద్రబాబు శవం దొరికితే రాజకీయం చేసేందుకు వస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇదే దిన చర్యగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. 
 
అవినీతి అక్రమాల గురించి చంద్రబాబు నాయుడు చెప్పడం హేయమైన చర్య అంటూ తిట్టిపోశారు. చంద్రబాబు ఉంటుంది ఒక అక్రమ కొంపలోనేనని గుర్తుంచుకోవాలన్నారు. అక్రమ కొంపకోసం నానా యాగిచేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు.