Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సొంతింటికి దందా ప్రారంభించిన రోజా - బెదిరింపులకు దిగుతూ...

ఆదివారం, 1 అక్టోబరు 2017 (14:09 IST)

Widgets Magazine

ఫైర్ బ్రాండ్ ఆర్కే.రోజా.. ఏది చేసినా సంచలనమే. ఏది మాట్లాడినా వివాదాస్పదమే. దూకుడుగా వ్యవహరిస్తూ అధికార పార్టీని దుయ్యబట్టడమే పనిగా పెట్టుకుంది. అయితే రాష్ట్రస్థాయిలో రోజా చేస్తున్న హడావిడే అంతలా ఉంటే నియోజకవర్గంలో మాత్రం ఆమెపైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. తన సొంత ఇంటి నిర్మాణం కోసం బెదిరింపులకు దిగుతోందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
నగరి వైకాపా ఎమ్మెల్యే రోజా. ఈమె ఎమ్మెల్యేగా కంటే సినిమా యాక్టర్‌గానే చాలా మందికి సుపరిచితమే. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా అదే దూకుడును కొనసాగిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. రోజా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి వైసిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది. అయితే అప్పట్లోనే ఆమెను స్థానికురాలు కాదంటూ కొంత మంది ఆరోపించారు. తనకు నియోజకవర్గంలో సొంత నివాసం కూడా లేదని హైదరాబాద్, చెన్నైలో తిరిగే ఆమె నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో రోజా లోకల్‌గానే ఉండాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఆమె నగరిలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఆ ఇంటి నిర్మాణం వివాదాస్పందగా మారింది. ఇంటిని పూర్తిగా స్పాన్సర్ల డబ్బులతోనే నిర్మిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు టిడిపి నాయకులు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా ఉండి సొంత ఇంటిని నిర్మించుకుంటూ దాని నిర్మాణం కోసం దందాలకు పాల్పడుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. 
 
ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి అంతటినీ తనకు ఫ్రీగా అందించాలంటూ నియోజకవర్గంలో ఉండే కొంతమంది బిల్డర్లను బెదిరిస్తుందంటున్నారు టిడిపి నాయకులు. ఉదయం లేచింది మొదలు తాను మహిళనంటూ, మహిళా ఎమ్మెల్యేని అవమానించారంటూ హడావిడి చేసే రోజా ఇలా బెదిరింపులకు దిగడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు నియోజకవర్గానికి చెందిన తెదేపా నేతలు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకే చెప్పని వై.ఎస్.జగన్

వైఎస్. జగన్... ఏపీలో ప్రతిపక్ష నేత, వైకాపా వ్యవస్థాపకుడు. అలాంటి వ్యక్తి ఏ విషయాన్ని ...

news

సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్‌ చేసిందని గోడకుర్చీ వేసిన బాస్

సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్ చేసిందనీ ఉద్యోగికి కంపెనీ బాస్ గోడకుర్చీ వేసిన ఘటన ...

news

ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం

పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్‌లోకి ...

news

దిగ్విజయ్ సింగ్ సంచల నిర్ణయం... కొంతకాలం దూరంగా...

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన ...

Widgets Magazine