పెందుర్తి మహిళను వివస్త్ర చేశారు.. మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా?

బుధవారం, 20 డిశెంబరు 2017 (17:49 IST)

rk roja

విశాఖలోని పెందుర్తిలో ఓ మహిళను భూకబ్జాదారులు వివస్త్రను చేశారు. కబ్జాను ప్రశ్నించిన ఓ దళిత మహిళను వివస్త్రను చేసి దారుణంగా ప్రవర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే కబ్జాకోరులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ప్రభుత్వ భూములు లేదా డాక్యుమెంట్లు లేని భూములు, వివాదంలో ఉన్న భూములు ఉంటే వాటిపై కబ్జాదారులు సొంతం చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు బాధిత మహిళ కేసు నమోదు చేసింది. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు జరుగుతున్నప్పటికీ మహిళా మంత్రులు స్పందించట్లేదని మండిపడ్డారు. మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా అంటూ చిత్తూరులో రోజా మాట్లాడుతూ.. మండిపడ్డారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వేరుగా మాట్లాడారు. పెందుర్తిలో మహిళపై జరిగిన ఘటన సభ్య సమాజం సిగ్గుపడేటట్లు ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తల్లిని సరిగా చూసుకోవడం లేదనీ భార్యలను తగలబెట్టిన భర్త...

తన తల్లిని సరిగా చూసుకోవడం లేదన్న కోపంతో తన ఇద్దరు భార్యలను తగలబెట్టాడోభర్త. ఈ ఘటన ...

news

ఆర్కే నగర్ బై పోల్ ... గెలుపు ఆయనదే : స్వామి జోస్యం

చెన్నై ఆర్.కె.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్‌ విజయం ...

news

గంగానదిలో మొత్తం అస్థికలు కలపవద్దు: సత్యపాల్ సింగ్

గంగానదిలో అస్థికలు కలపడమనేది హిందువుల విశ్వాసమే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులు అందుకు ...

news

2017: భారతదేశ ప్రజలను బాధించిన ఆ సంఘటనలు...

మానవుడి నైజమే అంత. భవిష్యత్తును గురించి ఊహాగానాలు చేసుకోవడం, గత జ్ఞాపకాలను తలుచుకుని ...