ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (12:47 IST)

సొంత భవనంలో ప్రభుత్వ ఆఫీసులు.. రూ.కోట్లు కొల్లగొట్టిన కోడెల : విజయసాయిరెడ్డి

మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్‌పై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్పీకర్ పదవికి కోడెల కళంకం తెచ్చారని మండిపడ్డారు. తన సొంత భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులను నెలకొల్పి అద్దె రూపంలో కోట్లాది రూపాయల మేరకు ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ప్రజాధనం దోపీడీలో జులుం ప్రదర్శించి కోడెల స్పీకర్ పదవికే కళంకం తెచ్చారు. ఆరోగ్య శ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్, ఫార్మసీ కౌన్సిల్ వంటి కార్యాలయాలను కనీస వసతులు కూడా లేని తన సొంత భవనంలో పెట్టించారు. చదరపు అడుగుకు రూ.16 అద్దె అయితే, పైరవీ చేసుకుని రూ.25 వేలు తీసుకున్నారు. ఇలా రూ.4.50 కోట్లకు పైగానే ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు.