మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (14:23 IST)

ప్రత్యేక హోదాపై కుంటిసాకులు వద్దు.. ఇస్తారా? ఇవ్వరా? కేంద్రంపై సాయిరెడ్డి ఫైర్

కేంద్ర ప్రభుత్వంపై వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా అంశంపై ఆయన కేంద్రాన్ని నిలదీశారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా? లేదా? అనే అంశాన్ని తేల్చాలన్నారు. దీనిపై పదేపదే కుంటిసాకులు చెప్పొదంటూ మండిపడ్డారు. 
 
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంపై ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించకుండా కాలయాపన చేస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రధానంగా రెండు అంశాలను తాను ఇక్కడ ప్రస్తావించదలచుకున్నట్టు చెప్పారు. అందులో ఒకటి ప్రత్యేక హోదా. రెండోది ఏపీకి నికర రుణ పరిమితిని ఎందుకు తగ్గించారంటూ ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో ఏపీ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.