మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (17:45 IST)

ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు : విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్

టీడీపీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్టీ.రామారావుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవడాన్ని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు టార్గెట్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ సంచలన ట్వీట్ చేశారు. 
 
ఎన్టీఆర్‌ను పదవీచ్యుతిడిని చేసి నేటికి 26 రోజులు. అందుకే నేడు అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా పేర్కొంటూ విజయసాయి ట్వీట్ చేశారు. ఇదే అంశంపై విజయ సాయి ఓ ట్వీట్ చేశారు 1995 ఆగస్టు నెలలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి చంద్రబాబు తెరవెనుక కుట్ర చేశాడని, నిత్యం ఆయన పక్కనే ఉంటూ ఆయనకు తెలియకుండా వెన్నుపోటు రాజకీయాలు చేసి పార్టీ నుండి అత్యంత అవమానకరంగా గెంటేసి, సెప్టెంబర్ ఒకటో తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడని విమర్శిస్తున్నారు. 
 
అప్పటినుండి ఇప్పటివరకు చంద్రబాబును, చంద్రబాబుకు సహకరించి మామను వెన్నుపోటు పొడవడంలో కీలకంగా పనిచేసిన తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏదేమైనా తాజాగా విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో మరోమారు చర్చనీయాంశంగా మారింది.
 
ఇక సోషల్ మీడియా వేదికగా ఆగస్ట్ 23 ప్రపంచ వెన్నుపోటు దినోత్సవం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వెన్నుపోటుకు శ్రీకారం చుట్టి నేటికి 26 ఏళ్లని , ఆగస్టు 23వ తేదీన కుట్ర మొదలైందని, ఇప్పుడు 23 వ తేదీన 23 సీట్లతోనే టిడిపి మిగిలిపోయిందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం అవుతోంది. 
 
తమ్ముళ్ళందరికీ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన రోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్‌లు హల్ చల్ చేస్తున్నాయి. నాడు ఎన్టీఆర్‌ని సస్పెండ్ చేశారు బహిష్కరించారు, అయినా సరే ఎన్టీఆర్ బొమ్మ వాడుకుంటారు అంటూ వైసిపి ఫాలోయర్స్ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు అప్పటినుండి ఇప్పటివరకు భారతరత్న ఇస్తూనే ఉన్నారు అంటూ విజయసాయి సెటైర్లు వేశారు.