శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2023 (12:19 IST)

కళ్లలో కారం చల్లి.. గొడ్డళ్లు, వేటకొడవలితో వైకాకా కార్యకర్తల హత్య

murder
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. కూనిరెడ్డి కృష్ణారెడ్డి అనే వైకాపా కార్యర్తను ప్రత్యర్థులు గొడ్డళ్లు, వేటకొడవళ్ళతో నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. జిల్లాలోని జంగమహేశ్వరం గ్రామంలో ఈ హత్య జరిగింది. అధికార పార్టీ కార్యకర్త ఒకరు హత్యకు గురికావడం జిల్లాలో కలకలం రేపింది. కృష్ణారెడ్డి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితులు చేజారిపోకుండా గ్రామంలో భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. కృష్ణారెడ్డిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 
 
కృష్ణారెడ్డి పులిపాడు ప్రభుత్వ వైన్ షాపులో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు. ముసుగులు ధరించిన ఐదుగురు ప్రత్యర్థులు కళ్ళలో కారం చల్లి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఈ హత్యకు రాజకీయ కారణాలా లేక ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గురజాల మండలంలో ఉన్న జంగమహేశ్వరం గ్రామానికి ఫ్యాక్షన్ చరిత్ర ఉండటం గమనార్హం. మరోవైపు, టీడీపీ వాళ్లే ఈ హత్యకు చేయించారని వైకాపా శ్రేణులు ఆరోపిస్తున్నారు.