1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 13 జూన్ 2024 (16:21 IST)

ఏపీలో అరాచక పాలన సాగుతుంది... బీజేపీ బాధ్యత వహించాలి : వైవీ సుబ్బారెడ్డి (Video)

yv subbareddy
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు నుంచి ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా ఏపీలో అరాచక, విధ్వంసక పాలన సాగుతుందని వైకాపా ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన తితిదే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మరో సీనియర్ నేత విజయసాయి రెడ్డితో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, "చంద్రబాబు రాక్షస పాలన చేస్తున్నారు. ప్లాన్ ప్రకారమే ప్రమాణ స్వీకారానికి ముందే వైయస్ఆర్ సీపీ నాయకుల ఆస్తులపై దాడులు చేస్తున్నారు. పోలీసుల ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. దాడుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రధానికి, హోం మంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఈ దాడులకు బీజేపీ కూడా బాధ్యత వహించాలి" అంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన మాటల వీడియోనూ మీరూ చూడండి.