శ్రీనాథుడి పద స్పర్శతో పులకించిన "రాచకొండ"

Rachakonda
FILE
అయితే రేచర్ల పద్మనాయకుల పాలన నాటి రాచరిక అవశేషాలు, చారిత్రాత్మక చిహ్నాలు రాచకొండను దర్శించే పర్యాటకులకు నేటికీ దర్శనమిస్తున్నాయి. రాచకొండ ఆస్థానంలో వేద వేదాంగాలు, ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, నాటకాలు, అలంకార శాస్త్రాలు, రాజనీతి, ధర్మాచరణ, సామాజిక, సంగీత, కళా శాస్త్రాలను అవపోశన పట్టిన దిట్టలు ఉండేవారని పూర్వీకులు చెబుతుంటారు.

ఆనాటి అగ్రహారాలు, దేవాలయాలు.. విద్యాలయాలుగా విలసిల్లేవనీ.. రాచకొండను పాలించిన మూడో సింగపాలుడు ప్రతి ఏడాది ఇక్కడ వసంతోత్సవాలను ఏర్పాటు చేసి రాజ్యంలోని సకల కళాకోవిదులను రప్పించి సన్మానించేవారట. సింగపాలుడు స్వయంగా కవి కావటంతో.. పశుపతి, నాగనాథ పండితుడు, బొమ్మకంటి అప్పయాచార్యుడు తదితరులు ఈయన ఆస్థానంలో ఉండేవారట.

భాస్కర రామాయణ శేషాన్ని పూరించిన అయ్యచార్యుడు రాచకొండ రాజ్యానికి చెందినవారేనట. ఈయన కుమారుడే హరిశ్చంద్ర చరిత్రను రచించిన గౌరన. అలాగే కవి సార్వభౌముడు శ్రీనాథుడు రాచకొండ ఆస్థానంలోని దుర్గాన్ని సందర్శించి, సరస్వతీదేవిని స్తుతించి రాజుల మన్ననలను పొందారు. మహాకవి బమ్మెర పోతన కూడా రాచకొండ మూడో సింగ భూపాలుడి ఆస్థానకవిగా పనిచేశారు. అలాగే తెలుగు సాహిత్యంలో పెద్దక కంటే ముందు ఆంధ్ర కవితా పితామహుడిగా పేరుపొందిన కొరివి సత్యనారాయణ కూడా రాచకొండలోనే ఉండేవారట.

అయితే ఇంతటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన రాచకొండ గుట్టలు ఇంతకాలం పాలకుల నిర్లక్ష్యానికి సాక్షీభూతాలుగా మిగిలాయి. పురావస్తు శాఖవారి నిరాదరణకు కూడా గురైన ఈ ప్రాంతంలోని గత చరిత్ర ఆనవాళ్లుగా మిగిలిన అనేక చారిత్రక కట్టడాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. సరైన ఆలనా, పాలనా లేని కారణంచేత అవి మట్టిలో కలిసిపోయేందుకు సిద్ధంగ ఉన్నాయి.

అలాగే సరైన రక్షణ ఏర్పాట్లు లేని కారణంతో ఈ ప్రాంతంలోని శిల్ప సంపద అక్రమార్కుల పాలబడి తరలింపుకు గురవుతోంది. అలాగే గుప్త నిధుల కోసం కట్టడాలను ధ్వంసం చేస్తున్నారు. రాచకొండ గుట్టల్లో అనేక శివాలయాలు, వీరభద్ర ఆలయాలు, శ్రీరామచంద్ర స్వామి దేవస్థానాలు మొదలైనవి సుమారు 30కి పైబడే ఉన్నాయి. వీటిలోని శ్రీరామచంద్రస్వామి ఆలయం మాత్రం కాస్త ఉన్నత స్థితిలో ఉంది.

Ganesh|
ఇక రాచకొండ గుట్టలు శత్రు దుర్భేద్యంగా ఉండటంతో రెండు దశాబ్దాల నుంచి మావోయిస్టుల స్థావరంగా కూడా మారిపోయాయి. ఎన్‌కౌంటర్లతో ఈ ప్రాంతం పలుమార్లు రక్తం చిందించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కొంతకాలం నుంచి ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో.. ఇప్పటికైనా ప్రభుత్వం, పర్యాటక శాఖవారు రాచకొండవైపు దృష్టి సారించి.. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :