సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-08-2021 శనివారం దినఫలాలు - సరస్వతి దేవిని ఆరాధించినా...

మేషం : వస్త్ర, బంగారం, వెండి ఫ్యాన్సీ వ్యాపారాల్లో పోటీతత్వం అధికంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు ఆలయాలలో సందర్శనాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. చేతి వృత్తుల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది. కోర్టు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. 
 
వృషభం : ఉద్యోగస్తులు తోటివారితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో స్వల్ప మార్పులు, మరమ్మతులు చేపడతారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అరుదైన ఆపరేషన్లను వైద్యులు విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
మిథునం : వృత్తి ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వాహన చోదకులకు ఊహించని చికాకులెదుర్కోవలసి వస్తుంది. బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో పునరాలోచన మంచిది. 
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మిరంతగా శ్రమించవలసి ఉంటుంది. 
 
సింహం : మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉపాధ్యాయులు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రుణ విముక్తులుకావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. ఇతరులకు మేలు చేసి అపవాదుల పాలవుతారు. 
 
కన్య : ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు హోదా పెరగడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి. 
 
తుల : కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. రాజకీయ నాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. చిన్నతరహా పరిశ్రమలు, వ్యావసాయ రంగాల వారికి ఆశాజనకం. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. 
 
వృశ్చికం : మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. వ్యాపారాల పట్ల ఏకాగ్రత అవసరం. స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
ధనస్సు : మీ కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు వాయిదాపడుట వల్ల నిరుత్సాహానికి గురవుతారు. 
 
మకరం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 
 
కుంభం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. స్వయంకృషితో రాణిస్తారు. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. మీ అభిరుచలకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
మీనం : మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. సభల, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు వాయిదాపడతాయి. బంధువుల ఆకస్మిక రాక మీకు ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాబడికి మించిన ఖర్చులెదుర్కొంటారు.