శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-01-2021 మంగళవారం దినఫలాలు - తులసీ దళాలతో నారాయణునుడిని పూజించినా...

మేషం : పుణ్యక్షేత్ర సందర్శనాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి నిరుత్సాహం, ఆందోళనలు తప్పవు. ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. పెద్దలల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. షేర్ల క్రయ విక్రయాలు ఆశాజనకం. 
 
వృషభం : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. నూతన కాంట్రాక్టులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలమవుతాయి. వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. పత్రికా సంస్థలలోని వారికి ఒక సమాచారం ఆదోళన కలిగిస్తుంది. 
 
మిథునం : వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. బంధు మిత్రులతో ప్రయాణాలు సాగిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్యమైన ఫలితాలను ఇస్తాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సమస్యలు తలెత్తుతాయి. కళ, క్రీడా, సాంకేతిక రంగాలలో వారికి ప్రోత్సాహం లభిస్తుంది.
 
కర్కాటకం : ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. మీ ఉన్నతిని చూసి కొంతమంది అపోహపడే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. 
 
సింహం : స్త్రీలకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలలో పెద్దల నుంచి అభ్యంతరాలు ఎదుర్కొంటారు. 
 
కన్య : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఆలయాలను సందర్శిస్తారు. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. తరచూ సన్మానాలు సభల్లో పాల్గొంటారు. విదేశాలలోని వారికి వస్తు సామాగ్రి, విలువైన పత్రాలు అందజేస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. 
 
తుల : స్త్రీలకు టీవీ కార్యక్రమాలలో అవకాశం, బహుమతులు అందుతాయి. భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయి. బంధు మిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. మీ  పాత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. 
 
వృశ్చికం : దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఏది జరిగినా మంచికేనని భావించండి. షాపుల అలంకరణ, కొత్త స్కీమ్‌లతో వ్యాపారాలు ఊపందుకుంటాయి. దంపతుల మధ్య అన్యోన్యత లోపం, పట్టింపులు చోటుచేసుకుంటాయి. 
 
ధనస్సు : ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. అదనపు రాబడి, చేబదుళ్ల కోసం యత్నిస్తారు. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. సమస్యలకు పరిష్కారమార్గం, గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. నూతన దంపతుల్లో ప్రేమానుబంధాలు బలపడతాయి. 
 
మకరం : స్త్రీలు ప్రతిభాపోటీల్లో రాణిస్తారు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ప్రయాణాల్లో ఊహించని ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. మీ సంతానం కోసం విద్యా, ఆరోగ్యం విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తారు. సంఘంలో పలుకుబడికలిగిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. ఖర్చులు, చెల్లింపులు అధికమవుతాయి. 
 
కుంభం : ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు ఊహించినవే కావడంతో ఇబ్బందులు ఉండవు. గృహ మరమ్మతులు అనుకూలిస్తాయి. ధనం చేతిలో నిలబడటం కష్టమే. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరుకావడంతో ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. 
 
మీనం : కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. వాణిజ్యం ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది.