బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-11-2020 శనివారం దినఫలాలు - అభయ ఆంజనేయ స్వామిని పూజించినా...

మేషం : కుటుంబ పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. దంపతుల మధ్య అపోహలు తొలగి అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్ల ప్రగతి పథంలో సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపిస్తుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. 
 
వృషభం : ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికంకావడంతో శ్రమాధిక్యత తప్పదు. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం నెరవేరకపోగా ధనం మరింత వ్యయం అవుతుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలించనా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రయత్నం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
మిథునం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఖర్చులు పెరిగిన సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి. 
 
కర్కాటకం : భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. దూరపు బంధువుల నుంచి అందిన ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుబంలో స్త్రీల ఆధిపత్యం కొనసాగుతుంది. మీ సంతానం విపరీత ధోరణి చికాకు పరుస్తుంది. ఇతరులపై ఆధారపడక, ప్రతి వ్యవహారం మీరే సమీక్షించుకోవడం అన్ని విధాలా క్షేమదాయకం. 
 
సింహం : రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. బంధు మిత్రులు ఒత్తిడి, మొహమ్మాటాలకు గురి చేస్తారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
కన్య : ఉద్యోగస్తులు కానుకలందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. మీ బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. రాబడికి మించిన ఖర్చులెదురైనా తట్టుకుంటారు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 
 
తుల : ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలు అనుకూలిస్తాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. 
 
వృశ్చికం : రుణయత్నాల్లో ఆటంకాలు తొలగిపోయి ధనం మంజూరు కాగలదు. స్త్రీలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. కలప, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. తీర్థయాత్రలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. బంధువుల తాకిడి అధికంగా ఉంటుంది. 
 
ధనస్సు : ధనం విరివిగా వ్యయం చేసి అపోహలకు గురవుతారు. మీ మాటకు కుటుంబీకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. మీ సంతానం మొండితనం చికాకు పరుస్తుంది. వాహన చోదకులకు ఊహించని చికాకులెదురవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల వేధింపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
మకరం : మిత్రుల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి. మీ సంతానం మొండితనం చికాకు పరుస్తుంది. ఉద్యోగస్తులు చేసే ప్రతి పనిలోను ఏకాగ్రత ముఖ్యం. వ్యాపారాభివృద్దికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. షేర్ల క్రయ, విక్రయాలు ఆశించినంత లాభదాయకంగా ఉండవు. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
కుంభం : రేషన్ డీలర్లు, చిరు వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. పత్రికా సంస్థలలోని ఉద్యోగస్తులకు యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో సోదరుల తీరు ఆగ్రహం కలిగిస్తుంది. అతిథి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. వనసమారాధనలు, శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
మీనం : నిరుద్యోగులకు ప్రకటనలు, జాబ్ ఏజెన్సీల పట్ల అప్రమత్తత అవసరం. అవివాహితుల్లో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. కీలకమైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి ఉపకరిస్తాయి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.