శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-03-2021 సోమవారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించినా...

మేషం : ఆర్థిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. గృహ నిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. మీ సమర్థత, పట్టుదలలే విజయానికి పెట్టుబడులని గమనించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. 
 
వృషభం :  బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఉన్నత విద్యా, పరిశోధనలు, చర్చలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. 
 
మిథునం : ఉద్యోగస్తులు, అధికారులకు కానుకలు అందించి వారిని ప్రసన్నం చేసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు జయం చేకూరుతుంది. సభలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం : సిమెంట్, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు కలిసివచ్చును, పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారు, సహకార సంఘాలలో వారు పనిలో ఏకాగ్రత వహించలేకపోవుట వల్ల అధికారులతో మాటపడాల్సి వస్తుంది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 
 
సింహం : ఆర్థిక వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. సొంతంగాగానీ, భాగస్వామ్యంగాగానీ చేసిన వ్యాపారాలు కలిసివచ్చును. 
 
కన్య : వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి. దైవ కార్యక్రమాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు మెళకు వహించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ ధ్యేయం నెరవేరుతుంది. 
 
తుల : వైద్యులు అరుదైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. రాబడికి మించిన ఖర్చులు ఎదురైనా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ రంగాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. 
 
వృశ్చికం : మీ యత్నాలకు ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన పెట్టుబడుల విషయంలో మెళకువ అవసరం. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. నిరుద్యోగులకు విజయం వరిస్తుంది. విద్యార్థులు చదువుల పట్ల ఏకాగ్రత వహించండం వల్ల విజయాన్ని పొందుతారు. 
 
ధనస్సు : ఆర్థిక స్థితిలో కొంత పురోగతి కనిపిస్తుంది. కొన్నిసార్లు తక్కువ వారి నుంచి సహాయం పొందవలసి వస్తుంది. దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడతాయి. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్త అవసరం. 
 
మకరం : మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ధనం ఎంత వస్తున్నా పొదుపు చేయలేకపోతారు. తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. 
 
కుంభం : చేతివృత్తి వ్యాపారులకు అవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపులు వల్ల ఒడిదుడుకులు తప్పవు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖుల కలయిక ఆశించిన ప్రయోజనం ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగులు పై అధికారుల మన్ననలు పొందుతారు. 
 
మీనం : మిమ్మల్ని వ్యతిరేకించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారుక పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు.