శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-09-2020 బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధిస్తే...

మేషం : స్త్రీలు ఆడంబరాలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమదాయకం కాదు. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదని గమనించండి. అర్థంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. 
 
వృషభం : ప్రయాణాలు తత్కాలికంగా వాయిదా వేసుకుంటే మంచిది. ఆరోగ్యం విషయంలో సంతృప్తి కానరాదు. ఉద్యోగస్తులకు చేసే పనియందు ధ్యాస వహించడం మంచిది. పాత రుణాలు తీరుస్తారు. ఇతరుల విషయంలో తప్పిదాలు ఎంచక సంయమనం పాటించండి. లిటిగేషన్ వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. 
 
మిథునం : ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఆడిటర్ల మతిమరుపు పెరుగుటవల్ల ఆందోళన చెందుతారు. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన బలపడుతుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు ఇది అనువైన సమయమని గమనించండి. 
 
కర్కాటకం : మీ లక్ష్యం పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు కలిసిరాగలదు. కళ, క్రీడాకారులకు ఆశాజనకం. ఖర్చులు పెరిగినా ఆర్థిక ఇబ్బందులు అంతగా ఉండవు. సమస్యలతో రాజీపడటానికి యత్నించండి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
సింహం : సోదరులతో స్వల్ప అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. పెద్దల ఆశీస్సులు, ప్రశంసలు పొందుతారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో పనివారలతో చికాకులు తప్పవు. దైవ, పుణ్య కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. ఏ విషయంలోనూ తొందరపడక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
 
కన్య : మీ మాటలు కొంతమంది వక్రీకరించే ఆస్కారం వుంది. స్త్రీల మనోభావాలకు, పనితనానికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యలలో ప్రవేశం లభిస్తుంది. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
తుల : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు, చిన్నతరహా  పరిశ్రమల వారికి ఆశాజనకం. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తిచేస్తారు. స్థానచలనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరచారస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. 
 
వృశ్చికం : ఉద్యోగంలో శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడతారు. 
 
ధనస్సు : సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తిక చేకూరుతుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. మీ మనసు మార్పును కోరుకుంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
మకరం : విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఒత్తిడి, చికాకులు తప్పవు. కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు పురోభివృద్ధి. 
 
కుంభం : ఏదైనా అమ్మకానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. రుణప్రయత్నం వాయిదాపడగలదు. నిరుద్యోగులకు ఆశాజనకం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు. 
 
మీనం : అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రేమికుల మధ్య అపార్థాలను తొలగిపోతాయి. వాహనం నడుపుతున్నపుడు జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదాపడతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఒంటరిగా ఏపని చేయడం క్షేమం కాదని గమనించండి.