1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (11:20 IST)

10-12-2019 మంగళవారం మీ రాశి ఫలితాలు.. (video)

మంగళవారం పూట దత్తాత్రేయుని ఆరాధించినట్లైతే మీ సంకత్వం సిద్ధిస్తుంది. 
 
మేషం : కొరియర్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ స్థానచలనానికి ఆస్కారం వుంది. బ్యాంకు పనులు హడావుడిగా సాగుతాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
వృషభం: మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఎదురైన పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. మీ చుట్టుపక్కల వారికి సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం. ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
మిథునం: బంధుమిత్రుల రాకపోకలు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుస్తుంది. వాహన సౌఖ్యం పొందుతారు. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగుల యత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. పత్రికా సంస్థల్లోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి.
 
కర్కాటకం: వృత్తిపరంగా చికాకులు లేకున్నా ఆదాయ సంతృప్తి అంతగా వుండదు. రాజకీయనాయకులు పార్టీలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఎదుటివారికి ఉచిత సలహాలు ఇవ్వడం వల్ల ఇబ్బందులకు గురి కావలసివస్తుంది.
 
సింహం : మీ నిజాయితీకి మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారాల్లో ఒక నష్టం మరో విధంగా పూడ్చుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు.
 
కన్య: ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవాల్సి వుంటుంది. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి వుంటుంది. ఉపవాసాలు, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం. కోర్టుకు హాజరవుతారు.
 
తుల: ఆర్థికస్థితి సామాన్యంగా వుంటుంది. విద్యార్థులకు కోరుకున్న కోర్సుల్లో అవకాశం లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. మిత్రుల మాటతీరు, పద్ధతి కష్టం కలిగిస్తాయి. పొదుపు చేయాలనే మీ ప్రయత్నం ఏమాత్రం సాధ్యం కాదు. ఖర్చులు పెరగడంతో అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు.
 
వృశ్చికం: కొంతమంది మిమ్ములను ప్రలోభాలకు గురిచేసే ఆస్కారం వుంది. సభలు, సన్మానాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. బ్యాంకు ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులు అధికమవుతాయి. విత్తనాలు, మందులు, స్టేషనరీ, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
ధనస్సు: విద్యార్థులకు కోరుకున్న కోర్సుల్లో అవకాశం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి నిరుత్సాహం, ఆందోళన కలిగిస్తుంది. బంగారు, వెండి, తాకట్టు వ్యాపారస్తులకు శుభదాయకంగా వుండగలదు. గతంలో వాయిదా పడిన పనులు పునఃప్రారంభమవుతాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.
 
మకరం: రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ట్రావెలింగ్ ఏజెన్సీలకు మందకొడిగా వుంటుంది. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి జారిపోయే ఆస్కారం వుంది. విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది.
 
కుంభం: బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఖర్చులు పెరగడంతో అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలుంటాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
మీనం: కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసివచ్చే కాలం. బ్యాంకు లోన్లు, పర్మిట్లు మంజూరవుతాయి. స్త్రీలకు బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఒకరికి సాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. దూర ప్రయాణాల ముఖ్యోద్దేశం నెరవేరుతుంది. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా వుంటాయి.