శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (07:28 IST)

15-03-2021 సోమవారం దినఫలాలు - శంకరుడుకి ప్రత్యేక పూజలు చేసినా..

మేషం : ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం మంచిదికాదు. మిమ్మలను వ్యతిరేకంచిన వారే మీ సాన్నిహిత్యం కోరుకుంటారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. షామియాన, సప్లయ్ రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి. బంధువులను కలుసుకుంటారు. 
 
వృషభం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ మాటతీరు, పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. అనుకున్నది సాధించేవరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. రహస్య విరోధులు అధికంకావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు.
 
మిథునం : ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఉపాధి పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముందుగానే ధనం సర్దుబాటు చేసుకోవడానికి యత్నించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మాట్లాడలేని చోట మౌనం వహిచడం మంచిది. 
 
కర్కాటకం : పెంపుడు జంతువుల పట్ల ఆందోళన చెందుతారు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఖర్చులు అధికం కావడంతో రుణాలు, చేబదుళ్లు తప్పవు. పాత మిత్రుల కలయిక ఎంతో సంతృప్తినిస్తుంది. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
సింహం : వ్యాపారాల్లో ఆకర్షణీయమైన ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. బంధువుల రాక వల్ల గృహంలో సందడి కానవస్తుంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చులు వినియోగించవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. 
 
కన్య : పాత వస్తువులనుకొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబీకుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు చర్చకు వస్తాయి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. వస్త్ర, బంగారు వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టడం మంచిది. 
 
తుల : మీపై శకునాలు, పట్టింపులు తీవ్ర ప్రభావం చూపుతాయి. కార్యసాధనలో ఆటంకాలెదురైనా ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకువేయండి. విదేశీ యత్నాలు ఫలించగలవు. స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. శత్రువులు మిత్రులుగా మారుతారు. ప్రత్తి, పొగాకు, కంది, స్టాకిస్టులకు వ్యాపారస్తులు కలిసివస్తుంది. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసి వస్తుంది. కాంట్రాక్టర్లకు ఎప్పడి నుంచో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. 
 
ధనస్సు : స్త్రీలకు విదేశీ వస్తువులపై ఆకర్షితులవుతారు. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. ఉపాధ్యాయ విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. ప్రముఖుల కలయిక సాధ్యమవుతుంది. 
 
మకరం : స్త్రీల ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. దూర ప్రయాణాలలో నూతన వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. వ్యూహాలు అమలు చేసి ప్రత్యర్థులపై పట్టు సాధిస్తారు. దైవకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. విందు, వినోదాలో పరిమితి పాటించండి. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. 
 
కుంభం : మనస్సుకు నచ్చిన వారితో కాలం గడుపుతారు. మీ బంధువులను సహాయం అర్థించేబదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. సోదరీ, సోదరులు సన్నిహితులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. చేతి వృత్తుల్ల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
మీనం : స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వ్యూహాలు అమలు చేసి ప్రత్యర్థులపై పట్టు సాధిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమించవలసి ఉంటుంది.