గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-06-2021 బుధవారం దినఫలాలు - నవదుర్గాదేవిని ఆరాధించినా...

మేషం : మీ మాటతీరు, పద్ధతులను మార్చుకోవలసి ఉంటుంది. గృహంలో మార్పులు, మరమ్మతులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. 
 
వృషభం : ఉద్యోగస్తులకు పనిభారం, అధికారుల ఒత్తిడి తప్పదు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఆస్తి తగాదాలు, కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. రేపటి గురించి ఆలోచనలు అధికం కాగలవు. వృత్తుల్లో వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులు గురికాకండి. 
 
మిథునం : ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలిక సెలవు, లోన్లు మంజూరవువుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి అరకొర పనులే లభిస్తాయి. వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. మీ ఉత్సహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. 
 
కర్కాటకం : ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం తలపెడతారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు, ప్రలోభాలకు పోకుండా స్థిరచిత్తంతో మెలగలవలసి ఉంటుంది. గృహ నిర్మాణాలలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు ఆడంబరాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. 
 
సింహం : ఉద్యోగస్తులకు పనిభారం, అధికారుల ఒత్తిడి తప్పదు. బంధువు నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించగలగుతారు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. 
 
కన్య : కొత్త ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు సామాన్యం. విద్యార్థినులకు కొత్త పరిచయాలు, సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక, దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కార్యసాధనంలో ఓర్పు, పట్టుదల అవసరం. మిమ్మలను పొగిడేవారి పట్ల ఆప్రమత్తంగా ఉండండి. 
 
తుల : కాంట్రాక్టర్లకు చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, చికాకులు వంటివి తప్పవు. ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్నచోటికి బదిలీవంటి శుభవార్తలు అందుతాయి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం, విందు భోజనం వస్త్ర లాభం వంటివి శుభపరిణామాలు ఉంటాయి. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. 
 
వృశ్చికం : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అకాలభోజనం, శ్రమాధిక్య వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్త్రీలకు పనివారలతో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది.  కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. బంధు మిత్రులతో ప్రయాణాలు సాగిస్తారు. 
 
ధనస్సు : భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ హోదాను చాటుకోవడానికి ధనం బాగా వ్యయం చేయవలసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఏజెంట్లు, బ్రోకర్లు రియల్ ఎస్టేట్ రంగాల వారికి చికాకులు తప్పవు. అంతగా పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
మకరం : వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. వాహన చోదకులకు ఊహించని చికాకులెదురవుతాయి. నూతన దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. వాయిదాపడిన పనులు అనుకోకుండా పూర్తిచేస్తారు. 
 
కుంభం : చిరు వ్యాపారులకు, వృత్తుల వారికి ఆశాజనకం. పుణ్యక్షేత్రాల సందర్శనలు, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. గృహ నిర్మాణాల్లో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత ముఖ్యం. క్రయ, విక్రయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం ఉత్తమం. 
 
మీనం : నిరుద్యోగులకు ఇంటర్వ్యూలల్లో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు. మీ యత్నాలకు ఆటంకాలు తొలగిపోయి పనులు సానుకూలమవుతాయి. సోదరుల మధ్య సఖ్యత అంతగా ఉండదు. రాబడికి మించిన ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటారు. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకువస్తాయి.