శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

సోమవారం (17-05-2021) రాశిఫలితాలు - ఉమాపతిని ఆరాధించినా...

మేషం : బంధువులు మీ చిత్తశుద్ధిని శంకించే ఆస్కారంవుంది. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్‌లకు కొంతమంది అవరోధం కల్పిస్తారు. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృషభం : దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. వృత్తి విద్యా కోర్సులలో బాగా రాణిస్తారు. కొంతమంది మీ నుంచి ధనసహాయం అర్థిస్తారు. 
 
మిథునం : వ్యాపార విస్తరణలకు తగిన యత్నాలు చేస్తారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి లైసెన్సులు, పర్మిట్లు సానుకూలమవుతాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలిస్తుంది. 
 
కర్కాటకం : వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఆందోళన అధికమవుతుంది. పోస్టల్, ఎల్ఐసి ఏజెంట్లకు టార్గెట్లు ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలు అధికమవుతాయి. 
 
సింహం : గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కొంత మెరుగనిపిస్తుంది. బంధువుల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ వాక్‌చాతుర్యానికి, తెలివిటేతలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కన్య : కొబ్బరి, పండ్లు, పూల, చల్లని పానీయ చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఒప్పందాల, రిజిస్ట్రేషన్, వ్యవహారాల్లో మెళకువ వహించండి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. 
 
తుల : స్త్రీలకు అయినవారితో పట్టింపులెదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షలలో విజయం సాధిస్తారు. ఎంతటి సమస్యైనా ధీటుగా ఎదుర్కొంటారు. ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారం కాగలదు. 
 
వృశ్చికం : సినిమా, కళా రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. పుణ్యక్షేత్ర సందర్శనలు, దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబీకుల నడుమ అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
ధనస్సు : ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదాపడుట మంచిది. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామిక వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణ, నూతన పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. రిప్రజెంటేటివ్‌లకు అధిక శ్రమ, చికాకులు తప్పవు. 
 
మకరం : రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురవుతారు. అధిక ఉష్ణం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. బంధు మిత్రులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది. 
 
కుంభం : ఆర్థిక సమస్యలు కొలిక్కి వస్తాయి. స్త్రీల అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. బ్యాంకు నుంచి పెద్దమొత్తం నగదు డ్రా చేసే విషయంలో జాగ్రత్త వహించండి. ఆకర్షణీయమైన పథకాలతో వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. 
 
మీనం : క్యాటరింగ్, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రాజకీయాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారులు, పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. పెద్దమొత్తం నగదుతో ప్రయాణం క్షేమంకాదు.