శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-01-2020 శనివారం మీ రాశి ఫలితాలు...

విష్ణు సహస్రనామం చదివినా లేకుంటే విన్నా శుభం కలుగుతుంది. 
 
మేషం: వస్త్ర  వ్యాపారాలు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. మీ సమర్థత, నిజాయితీలకు సంఘంలో మంతి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. 
 
వృషభం: రుణాలు తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. మీ అతిథి మర్యాదలు, పద్ధతులు అందరినీ ఆకట్టుకుంటాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులు తప్పవు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. చేస్తున్న వ్యాపారాలపై దృష్టి పెట్టిన మంచి లాభాలను పొందుతారు. 
 
మిథునం: మీ క్రింద పనిచేయు వారితో దుడుసుగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రభుత్వం నుంచి పురస్కారాలు వంటివి పొందుతారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. శాంతియుతంగానే మీ సమస్యలు పరిష్కారం కాగలవు. ఒక అవకాశం అందివచ్చినట్లే వచ్చి చేజారిపోయే ఆస్కారం వుంది. 
 
కర్కాటకం: ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులు విమర్శలు ఎదుర్కొవలసి వుంటుంది. మీ ముందు పొగిడినా చాటుగా విమర్శిస్తారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. క్రీడా పోటీల్లో విద్యార్థుల అత్యుత్సాహ అనర్థాలకు దారితీసే ఆస్కారం వుంది. విద్యార్థుల ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. 
 
సింహం: వ్యాపారాల్లో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని లాభాల బాటలో నడిపిస్తారు. ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు, కలహాలు చోటుచేసుకుంటాయి. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు.
 
కన్య: రాజకీయాల్లోని వారికి శత్రువులు అధికమవుతున్నారని గమనించండి. రాబడికి మించి ఖర్చులు అధికం కావడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు వాయిదా వేయాల్సి వస్తుంది. మీ నుంచి విషయాలు రాబట్టేందుకు బంధువులు ప్రయత్నిస్తారు.
 
తుల: దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు.  జాగ్రత్త వహించండి. ఏకాంతం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
వృశ్చికం: కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రావలసిన ధనం కొంత ముందు వెనుకాలైనా అందుతుంది. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులకు వేడుకల్లో హడావుడి, చురుకుతనం అధికమవుతాయి. భార్యాభర్తల మధ్య అవగాహనలోపం వల్ల సమస్యలు తలెత్తుతాయి.
 
ధనస్సు: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు పడటం వల్ల మాట పడక తప్పదు. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై ప్రయత్నిస్తారు. స్త్రీలకు పనిలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు  రావలసిన బిల్లులు మంజూరవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు.
 
మకరం: మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. రావలసిన బకాయిలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వ చేయలేరు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు వేడుకలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కుంభం: వైద్యులకు శస్త్ర చికిత్సవ సమయంలో ఓర్పు, ఏకాగ్రత చాలా ముఖ్యం. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం వుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. తలపెట్టిన పనుల్లో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు. 
 
మీనం : స్త్రీలలో భక్తిపరమైన ఆలోచనలు అధికమవుతాయి. ముక్కుసూటిగా పోయే మీ స్వభావం వల్ల ఇబ్బందులెదుర్కుంటారు. మీ సమర్థత, నిజాయితీలకు ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. పత్రికా, మీడియా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.