గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-01-2021 మంగళవారం దినఫలాలు : కార్తికేయుడుకి పూజలు చేసినా...

మేషం : టెక్నికల్, విద్యా, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కృషికి తగిన ప్రతిఫలం ఆలస్యంగా అందుతుంది. ఆదాయం బాగున్నా ఏదో తెలియని అసంతృప్తి, అసహనానికి లోనవుతారు. ఉపాధ్యాయులకు యజమాన్యం ఒత్తిడి పెరుగుతుంది. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. 
 
వృషభం : సమావేశాల్లో మీకు గుర్తింపు లభిస్తుంది. సన్నిహితుల ఆంతరంగిక విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. ఓ మిమ్మలను ఆశ్చర్య పరుస్తుంది. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. 
 
మిథునం : పాత సమస్యలు పరిష్కార దిశగాసాగుతాయి. సాహిత్య సదస్సులలోనూ, బృంద కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాల వారి టార్గెట్లు పూర్తి కాగలవు. దూర ప్రయాణాలు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
కర్కాటకం : గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారితో సమస్యలు తలెత్తుతాయి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. రుసులు చెల్లించగలుగుతారు. మనుషులు మనస్తత్వం తెలుసుకుని మసలుట మంచిది. ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
సింహం : తలచిన పనులు నెరవేరి మీ కోరికలు తీరగలవు. చేపట్టిన పనులలో ఓర్పు, పట్టుదల అవసరం. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. విద్యార్థుల ఆలోచనలు పక్కదారిపట్టే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ప్రేమికుల మధ్య అనుమానాలు తొలగిపోతాయి.
 
కన్య : ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయం లోపిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యం. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, పరిస్థితుల అనుకూలతలు ఉంటాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఆదాయానికి మంచి ఖర్చులు అధికమవుతాయి. 
 
తుల : కుటుంబీకుల ఆరోగ్యంలో మెళకువ వహించండి. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి. మిర్చి, నూనె, ఆవాలు, చింతపండు, వెల్లుల్లి వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. తలపెట్టిన పనిలో కొంతమంది వెనుకలుగానైనా సంతృప్తి కానరాగలదు.
 
వృశ్చికం : భాగస్వామిక ఒప్పందాల్లో మీ ప్రతిపాదనలకు వ్యతిరేకత ఎదురవుతుంది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. అనుకున్న మొత్తం చేతికందుతుంది. మీ లక్ష్యసాధనంలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదతో కృషి చేయండి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
ధనస్సు : వాతావరణంలోని మార్పు, రైతులకు ఆందోళన కలిగిస్తుంది. వాహన చోదకులకు ఇబ్బందులు తప్పవు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుకు వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. 
 
మకరం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. భాగస్వామ్యులతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. స్త్రీల అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. అందరికీ సహాయం చేసి మాటపడతారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. 
 
కుంభం : శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసంగా కలిగిస్తుంది. మీ యత్నాలకు ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు అందిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టుట వల్ల దేనీమీద ఏకాగ్రత వహించలేరు. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మీనం : ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. మార్కెట్ రంగాల వారికి ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచనలు వాయిదావేయడం మంచిది. స్త్రీలకు షాపింగుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్తగా చేపట్టబోయే వ్యాపారాలు, సంస్థలకు కావలసిన పెట్టుబడి సర్దుబాటు కాగలదు.