సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-10-2020 సోమవారంవారం రాశిఫలాలు - మల్లికార్జునుడిని పూజించి అర్చిస్తే...

మేషం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్  రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. సభలు, సమావేశాల్లో మీ అలవాట్లు, వ్యసనాలు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. 
 
వృషభం : విదేశీయాన యత్నాలు చురుగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత, మెళకువ వహించండి. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఐరన్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. 
 
మిథునం : స్త్రీలకు స్కీములు, ప్రకటనల పట్ల ఆవగాహన అవసరం. వాదోపదవాదాలలకు హామీలకు దూరంగా ఉండటం మంచిది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. ఎరువులు, క్రమి సంహారక మందుల వ్యాపారులకు చికాకులు తప్పవు.
 
కర్కాటకం : ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎంతటివారైనా ఆకట్టుకుని వ్యవహారాలు చక్కదిద్దుతారు. కొబ్బరి, పండ్లు, పూల కూరగాయల వ్యాపారాలు లాభదాయకం. అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. భార్యాభర్తల ఆలోచనలు, అభిప్రాయభేదాలు భిన్నంగా ఉంటాయి. 
 
సింహం : రావలసిన ధనం సమయానికి అందుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
కన్య : మీ శ్రీమతి ఇచ్చిన సలహా పాటించడం మంచిది. ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. బంధువులతో గృహంలో సందడి కానవస్తుంది. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. 
 
తుల : ఉద్యోగస్తులు సమర్థతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. భాగస్వామిక వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. విద్యార్థులు బజారు తినుబండరాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోవనతారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి నాందీ పలుకుతాయి.
 
వృశ్చికం : విద్యార్థుల్లో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, మందలింపులు వంటివి తప్పవు. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారకి యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. దైవ దీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
ధనస్సు : కళాకారులకు రచయిలకు, పత్రికా రంగంలోని వారికి పురోభివృద్ధి కానరాగలదు. రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికమవుతున్నారని గమనించండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఆపరేషన్లు విజయవంతం కావడంతో వైద్యులకు మంచి పేరు లభిస్తుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. 
 
మకరం : అర్థాంతంరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలు, భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేతి వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. దంపతుల మధ్య కలహాలలు తలెత్తే ఆస్కారం ఉంది. అకాలభోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. తొందరపడి హామీలివ్వడం మంచిదికాదు. 
 
కుంభం : స్త్రీలకు టీవీ ఛానెళ్ళమంచి ఆహ్వానం, బహుమతులు అందుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. ఖర్చులు ఊహించినవే కావడంతో ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. ఒకస్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. 
 
మీనం : విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహ నిర్మాణాల ప్లాన్లకు ఆమోదం లభించడంతోపాటు రుణాలు మంజూరవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు.