మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-06-2021 గురువారం దినఫలాలు - కుబేరుడిని ఆరాధించడం వల్ల...

మేషం : నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనచోదకులకు చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. ప్రేమానుబంధాలు బలపడతాయి. మీ కుటుంబ విషయాలు కానీ, మీ మనోవాంఛలు కానీ బయటకు బహిర్గతం చేయకండి. ఎదుటివారి తప్పులను క్షమించేవాడు, బలవంతుడు అన్న వాస్తవాన్ని గ్రహించండి. 
 
వృషభం : ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఎంతో ఇబ్బంది కలిగించవచ్చు. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. టెక్నికల్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. గృహంలో మార్పులు, చేర్పులుక అనుకూలమైన కాలం కాదు. ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
మిథునం : విద్యార్థినలలో పురోభివృద్ధి కానవస్తుంది. ఎదుటివారిని ఆకట్టుకోగలుగుతారు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వాతావరణంలోని మార్పులు మీకు ఎంతో చికాకు కలిగిస్తాయి. ఉచిత సలహాలు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. ప్రేమానుబంధాలు బలపడగలవు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి శుభదాయకం. 
 
కర్కాటకం : రుణ ప్రయత్నం వాయిదాపడుతుంది. ఆపరేషన్లు చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువ అంచనా వేసివారు మీ సహాయాన్ని అర్థిస్తారు. ధన స్థానంనందు గురుసంచారం వల్ల ఊహించని ఖర్చులు అధికమవుతాయి. 
 
సింహం : స్త్రీలకు కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు ఆశాజనకంగా నడుస్తుంది. మీ ఆలోచనలను క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాల వారికి త్రిప్పట, శ్రమ, చికాకులు వంటివి తప్పవు. నిరుద్యోగులకు ఒక అవకాశం కలిసివస్తుంది. 
 
కన్య : పండ్లు, పూలు, కొబ్బరి వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. ఆలయాలను సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభింగలదు. ప్రైవేటు రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిత్యావరసర వస్తు వస్టాకిస్టులకు పురోభివృద్ధి కానరాగలదు. 
 
తుల : వస్త్ర, బంగారు వెండి, లోహ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. ఎదుటివారిని గమనించి ఎత్తుకు పైఎత్తు వేస్తారు. మీ విరోధులు వేసే పథకాలను తేలికగా గ్రహిస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ కళత్ర ఆరోగ్యం మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
వృశ్చికం : ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. బంధు మిత్రులతో కలిసి సరదాగా గడపగలుగుతారు. అవివాహితులకు ఒక వార్త ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. భూమికి సంబంధించిన విషయాలను చర్చిస్తారు. చిన్న తరహా పరిశ్రమల వారికి శుభదాకయం. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. 
 
ధనస్సు : ముఖ్యమైన కార్యక్రమాలలో మీకు గుర్తింపు లభిస్తుంది. చిన్న తరహా పరశ్రమల వారికి మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు శుభదాయకం. ఇతరులను తక్కువ చేసి అంచనా వేసి మాట్లాడటం వల్ల అపవాదులు సమస్యలు వంటివి ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి. పెద్దలను ప్రముఖులను కలుసుకుంటారు. 
 
మకరం : ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ లేకపోయినా పురోభివృద్ధి ఏదీ ఉండదు. చేతి వృత్తుల వారికి పనిభారం పెరుగుతుంది. సంగీత, సాహిత్య సదస్సులలో చురుకుగా పాల్గొంటారు. అష్టమ గురు దోషం ఉండటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. విద్యా రంగాలలోని వారికి సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. 
 
కుంభం : ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. ఐరన్ వ్యాపారస్తులకు చికాకు తప్పదు. మీ ఆలోచనలను, మీ భావాలను, మీ కుటుంబీకులకు తెలియజేయడం వల్ల, సంతృప్తి కానరాగలదు. పండితులకు, శాస్త్రజ్ఞులకు, కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. 
 
మీనం : స్త్రీలకు అశాంతి అధికమవుతుంది. మీ కుటుంబీకుల గురించి పథకాలు వేస్తారు. చిన్న తరహా పరిశ్రమల వారికి ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సిమెంట్, కలప, ఐరన్, వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. ఇతరుల గురించి అధికంగా ఆలోచించడం వల్ల మనోవేదన తప్పదు.