సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-03-2024 శుక్రవారం దినఫలాలు - వృత్తుల వారికి మిశ్రమ ఫలితం...

astro1
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ బ॥ షష్ఠి తె.3.15 స్వాతి ఉ.9.17 ప.వ.3.10 ల 4.51.
ఉ.దు. 8.42 ల 9.29 ప. దు. 8. 42 ల 9.29 ప.దు. 12.35ల 1.22.
 
మేషం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి వంటివి ఎదుర్కొనక తప్పదు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకం. శతృవులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం.
 
వృషభం :- సంఘంలో గుర్తింపు రాణింపు లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వాహనం నడుపునపుడు మెళకువ, ఏకాగ్రత అవసరం. ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
మిథునం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు స్థానచలనంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. మీ శ్రీమతి మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం :- వృత్తుల వారికి మిశ్రమ ఫలితం. కొంతమంది మీ సాన్నిత్యాన్ని కోరుకుంటారు. రాజకీయనాయకులు తరచూ సభా సమావేశాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు ఒకంతట తేలవు. బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఆస్తి వ్యవహారాల్లో దాయాదుల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
సింహం :- ఆదాయానికి మించి ధనం అధికంగా వ్యయం చేస్తారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. భాగస్వామిక చర్చలు వాయిదా పడటం మంచిదని గమనించండి. విద్యార్థుల ఆలోచనలు నిలకడగా ఉండవు.
 
కన్య :- గృహనిర్మాణాలు చురుకుగా సాగుతాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. ఏజెంట్లకు సదావకాశాలు లభిస్తాయి. ప్రముఖుల పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. బృద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
తుల :- కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు పూర్తి కాగలవు. విదేశీ వస్తువులు సేకరిస్తారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. ఆడిటర్లకు పని ఒత్తిడి, ప్లీడర్లకు నిరుత్సాహం తప్పవు. విద్యార్ధినులకు టెక్నికల్, కామర్స్, కంప్యూటర్ విద్యలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఋణం కొంత అయిన తీర్చగలుగుతారు.
 
వృశ్చికం :- ఆర్థికపరమైన చర్చలు, సమావేశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. రచయితలకు, పత్రిక, మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. విద్యార్థినులు పట్టుదలతో శ్రమించి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. కుటుంబీకుల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం.
 
మకరం :- గొప్పగొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు.
 
కుంభం :- వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టసాధ్యం. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులతో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 
 
మీనం :- సొంతంగా వ్యాపారం చేయాలన్న ఆలోచనలు వాయిదా పడతాయి. పాత రుణాలు తీరుస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అవపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. భాగస్వామిక ఒప్పందాల్లో మీ ప్రతిపాదనలకు వ్యతిరేకత ఎదురవుతుంది. రాజకీయ, కళా రంగాలకు చెందినవారు లక్ష్యాలు సాధిస్తారు.