బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (07:42 IST)

02-06-2023 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం...

Goddess Lakshmi
మేషం :- బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అసవరం. వ్యాపారస్తులకు ప్రభుత్వ అధికారుల నుండి సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. మీ సంతానం మొండి వైఖరి వల్ల, చికాకులు తప్పవు.
 
వృషభం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కోర్టు వ్యవహారాలలో నిరుత్సాహం కానవస్తుంది. ఆభరణాల కొనుగోళ్ళ విషయంలో జాగ్రత్త వహించండి. మీ సంతానం మొండి వైఖరి వల్ల, చికాకులు తప్పవు. వాహన చోదకులు, యాజమానులు అప్రమత్తంగా ఉండాలి.
 
మిథునం :- ఇప్పటివరకు విరోధులుగా ఉన్నవారే మీ సహాయం అర్థిస్తారు. స్త్రీల అభిప్రాయాలు, అభిరుచులకు ఏమాత్రం స్పందన లభించదు. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారముంది. సొంత వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమిస్తారు. పెంపుడు జంతువుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. 
 
కర్కాటకం :- మీ శ్రీమతి సలహాలు, సూచనలు పాటించటం క్షేమదాయకం. మీ సంతానం కోసం ధనం ఖర్చు చేస్తారు. అసాధ్యమనుకున్న ఒక పనిని పట్టుదలతో శ్రమించి పూర్తి చేస్తారు. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. కార్మిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
 
సింహం :- ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ఉద్యోగస్తులకు అధికారులు గుర్తింపు లభిస్తుంది. ప్రేమికులకు పెద్దల నుంచి ఆమోదం లభిస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. వ్యాపారాలు అభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు.
 
కన్య :- దైవ పుణ్య కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణ, విదేశీయత్నాలు ఫలిస్తాయి. స్త్రీల అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. దంపతులు మధ్య అకారణ కలహం, పట్టింపులు అధికమవుతాయి. ఆపత్సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు.
 
తుల :- కళ్ళు, నడుము నరాలకు సంబంధించి చికాకులను ఎదుర్కుంటారు. రవాణా రంగాలవారికి ఒత్తిడి, చికులు తప్పవు. రాజకీయ కళా రంగాల వారికి కొంత అనుకూలిస్తుంది. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో అధికారుల నుంచి ఒత్తిడి, అభ్యంతరాలు ఎదురవుతాయి. స్త్రీలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
వృశ్చికం :- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఫలిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. చిన్న చిన్న విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం, చికాకులను ఎదుర్కుంటారు. సోదరి, సోదరుల మధ్య పోరు అధికంగా ఉంటుంది.
 
ధనస్సు :- వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకంమాని ఓర్పు, విజ్ఞతా యుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. స్త్రీల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు.
 
మకరం :- ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. స్త్రీలకు అధికశ్రమ దూరదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రావలసిన బకాయిలు వాయిదా పడుటవలన చికాకులను ఎదుర్కొంటారు.
 
కుంభం :- గృహోపకరణాల వస్తువుల కొనుగోలుకై షాపింగ్ చేస్తారు. సోదరులతో ఆనందంగా గడుపుతారు. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకం. ఆకస్మికంగా ఖర్చులు అధికమవుతాయి. సంఘంలోనూ కుటుంబంలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. స్త్రీలకు బంధువుల తాకిడివల్ల ఒత్తిడి, పనిభారం తప్పవు.
 
మీనం :- సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. గతంలో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడండి. రాజకీయాలలోని వారికి సంఘంలో స్థాయి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. స్థిరాస్తిని అమ్మడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి.