సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-10-2022 సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం..

mesham
మేషం :- ఆస్తి పంపకాల విషయంలో దాయాదులతో ఒక అవగాహనకు వస్తారు. ఎంతో కొంత పొదుపు చేద్దామనుకున్న మీ ఆశ నెరవేరదు. నేడు చేజారిన అవకాశం తిరిగి రావటం కష్టమని గ్రహించండి. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా వ్యవహరించండి. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. 
 
వృషభం :- ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. మీ సంతానం ప్రేమ వ్యవహారం, వివాహం పెద్ద చర్చనీయాంశం అవుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అవకాశం కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి, విశ్రాంతి లభిస్తాయి.
 
మిథునం :- బ్యాంకులు, ఏ.టి.ఎం.ల నుంచి ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. లీజు, ఏజెంట్లు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ప్రతి విషయంలోను అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. తలపెట్టిన పనులు మందకొడిగా పూర్తిచేస్తారు. ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం.
 
కర్కాటకం :- స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదం లభించదు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది. బంధువులకు వివాహ సమాచారం అందిస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకమైన ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి.
 
సింహం :- వృత్తిపరంగా ఎదురైన ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. కొన్ని విషయాలు మీ సమర్థతకు పరీక్షగా నిలుస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం, చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అధికారులకు మరింత చేరువవుతారు. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు.
 
కన్య :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషి ఫలిస్తుంది. మీ అవసరాలకు కావలసిన ధనం కోసం ఇబ్బందులెదు ర్కుంటారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. రేపటి గురించి ఆలోచనలు సాగిస్తారు. మీక్కావలసిన వస్తువు లేక పత్రాలు కనిపించకుండాపోయే ఆస్కారం ఉంది.
 
తుల :- ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. వృత్తి వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. విద్యార్థులు టెక్నికల్, కంప్యూటర్, సైన్సు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించండి. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికివస్తాయి.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులు విధినిర్వహణలో ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. మీ దైనందిన కార్యక్రమాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులు అధికం. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికమవుతాయి. ఒకానొక నిజాన్ని ధైర్యంగా ఒప్పుకోవటంతో ఇతరులకు మీరంటే గౌరవం ఏర్పడుతుంది.
 
ధనస్సు :- కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అధికంగా ఉన్నా సంతృప్తిని ఇస్తుంది. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిస్తేజానికి లోనవుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
మకరం :- వ్యాపారాభివృద్ధికి షాపుల అలంకరణ, కొత్త పథకాలు రూపొందిస్తారు. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. పత్రికా సంస్థలలోని వారికి పనిభారం, తోటివారి వల్ల మాటపడక తప్పదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కుంభం :- హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. విద్యార్థులు విదేశీ చదువులకోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగస్తుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బకాయిలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి.
 
మీనం :- తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు ప్రారంభిస్తారు. ప్లీడర్లు, ప్లీడర్లకు ఒత్తిడి, ఆందోళనలు అధికం. కష్టసమయంలో ఆత్మీయుల పలకరింపు ఓదార్పునిస్తుంది. వితండవాదం, భేషజాలకు దూరంగా ఉండటం ఉత్తమం.