గురువారం, 28 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-05-2024 ఆదివారం దినఫలాలు - కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో...

astro5
శ్రీ క్రోధినామ సం|| చైత్ర ఐ॥ ద్వాదశి ప.3.36 ఉత్తరాభాద్ర సా. 6.15 తె.వ.5.28 ల సా.దు. 4.34 ల 5.25.
 
మేషం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఏదైనా అమ్మకానికి చేయుప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. నూతన వస్తువులు వాహనాలు కొంటారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. మిత్రులను కలుసుకుంటారు. దైవ కార్యక్రమాలలో పూర్తిగా నిమగ్నులౌతారు.
 
వృషభం :- గృహంలో శుభకార్యానికై చేయుయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో ఏకాగ్రత ఎంతోముఖ్యం. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్ధులకు దూర ప్రాంతాల నుంచి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు.
 
మిథునం :- శ్రీవారు శ్రీమతి ఆర్యోగంపట్ల శ్రద్ధ చూపిస్తారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. బంధువుల రాకతో కొంత అ సౌకర్యానికి గురవుతారు. రాజకీయాల్లో వారికి సదావకావకాశాలు లభిస్తాయి. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. రిప్రజెంటేటివ్‌లకు అధిక శ్రమ, చికాకులు తప్పవు.
 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు అంతంతమాత్రంగా ఉంటాయి. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఆత్మీయులతో కలసి విహార యాత్రలలో పాల్గొంటారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
సింహం :- రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురౌతారు. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు చోటుచేసుకుంటాయి. రియల్ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కన్య :- కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. బంధు, మిత్రులను కలుసుకుంటారు. ఫ్యాన్సీ, కిరాణా, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. స్త్రీలకు విలువైన వస్తువులపట్ల ఆకర్షితులౌతారు.
 
తుల :- భాగస్వామిక, సొంత వ్యాపారాలు ఆశించినంత లాభదాయకంగా సాగవు. ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. ఖర్చుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించండి. మీ కృషికి ప్రోత్సాహం లభిస్తుంది. అవివాహితులకు శుభవార్తాశ్రవణం.
 
వృశ్చికం :- ఆర్థికంగా మంచి అభివృద్ధిని పొందుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకు చాలా అవసరం. కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. మీ సంతానం కోసం అధికంగా శ్రమిస్తారు. నిరుద్యోగులు సదావకాశాలు సద్వినియోగం చేసుకోవటం మంచిది.
 
ధనస్సు :- దైవదర్శనాలు చేస్తారు. చేతివృత్తులు, కాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ముఖ్యుల రాక ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. సినిమా, కళారంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాల్లో మెళకువ అవసరం.
 
మకరం :- విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏ.సి. రంగాల్లో వారికి పురోభివృద్ధి. చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
 
కుంభం :- కుటుంబ, ఆర్థిక సమస్యలు సర్దుకుంటాయి. వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. మీ అభిప్రాయాలను సూచన ప్రాయంగా తెలియజేయండి. ఆరోగ్యం, ఆహార విషయంలో మెళకువ అవసరం. కిరణా, ఫాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. ప్రేమికులు అతిగా వ్యవహరించి చిక్కుల్లోపడేఆస్కారం ఉంది.
 
మీనం :- మిత్రుల మాటతీరు, పద్ధతి కష్టం కలిగిస్తాయి. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దైవ సేవా, పుణ్యకార్యాక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఎంతటి వారినైనా మీ వాగ్దాటితో మెప్పిస్తారు. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది.