బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

05-09-2022 సోమవారం దినఫలాలు - లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం..

Lalitha Sahasranam
మేషం :- ఉపాధ్యాయులు సన్మానాలు అందుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరువ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. ప్రేమికులకు మధ్య అవగాహనా లోపం వల్ల ఊహించని పరిణామాలు సంభవిస్తాయి. తలపెట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు.
 
వృషభం :- ఉపాధ్యాయులు బహుమతులను అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో మెలకువ అవసరం. భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. మీ యత్నాలకు సన్నిహితులు అన్నివిధాలా సహకారం అందిస్తారు. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించు కుంటారు.
 
మిథునం :- ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి శ్రమాధిక్యతతప్పవు.
 
కర్కాటకం :- నూతన పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. సినీ కళాకారుల వల్ల రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలటంతో పొదుపు సాధ్యం కాదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు ఉల్లాసంగా గడుపుతారు.
 
సింహం :- ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించక పోవటంతో కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు గణనీయమైన అభివృద్ధి ఉంటుంది.
 
కన్య :- చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. పెరిగే ఖర్చులు, అవసరాలు మీ రాబడికి మించటంతో ఆందోళన, నిరుత్సాహం అధికమవుతాయి. వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయుకృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి.
 
తుల :- ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. ముఖ్యుల కోసం ధన వ్యయం చేస్తారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉన్నత ఉద్యోగులకు డెప్యుటేషన్ పై విదేశాలు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనివ్వగలవు.
 
వృశ్చికం :- విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల సమర్థత, ప్రతిభకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. మంచి తనంతో విరోధులను ఆకట్టుకుంటారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వృద్ధి పొందుతాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు.
 
ధనస్సు :- ప్రైవేటు,పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదాపడతాయి. బంధుమిత్రుల కలయికతో నూతన ఉత్సాహం కానవస్తుంది. ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలు, ఆరోగ్యంలో మెలకువ వహించండి. కార్యసిద్ధిలో అనుకూలత, చేపట్టిన పనులు వేగవంతమవుతాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మకరం :- స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. తీర్థయాత్రలు, విదేశీయానంకోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. గృహంలో మార్పులు వాయిదా పడతాయి. మీ మేలు కోరని వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ఒకింత పురోగతి కనిపిస్తుంది. ఆత్మీయుల కోసంధనం విరివిగా వ్యయం చేస్తారు. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటంది.
 
మీనం :- స్త్రీలకు విలువైన వస్తువులు, ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ పాత సమస్యలు పరిష్కారం కాగలవు. స్థిరచరాస్తులకు సంబంధించి ముఖ్యులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పెద్దల గురించి ఆందోళన తప్పదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.