మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-08-2023 - ఆదివారం మీ రాశి ఫలితాలు-మీ ఇష్టదైవాన్ని పూజించి?

Astrology
మీ ఇష్టదైవాన్ని పూజించి, సందర్శించినా చాలా శుభం.
 
మేషం:- విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. కల్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు. ప్రత్యర్థుల తీరు మీకు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.
 
వృషభం :- ఏదైనా అమ్మటానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. బంధు మిత్రుల రాక పోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
మిధునం:- వృత్తి, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విదేశీయానం కోసంచేసే యత్నాలు ఫలిస్తాయి. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు.
 
కర్కాటకం: – కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ఎంతో అవసరం. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. నూనె, ఎండుమిర్చి, చింతపండు, వ్యాపారులకు దినదినాభివృద్ధి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారంఉంది.
 
సింహం:- స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విదేశాలు వెళ్ళే ప్రయాణాలువాయిదా పడతాయి. బంధు మిత్రులతో పట్టింపులు ఎదుర్కుంటారు. మీ సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు.వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి.
 
కన్య:- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. సహోద్యోగులతో సమావేశాలు ఫలించకపోవచ్చు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి.
 
తుల: – యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. చర్చలలో కొన్ని లోపాలు తలెత్తుట వలన రాజకీయాలలో వారికి ఆందోళన తప్పదు. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు చోటు చేసుకుంటాయి. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి.
 
వృశ్చికం:- మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బంది కలిగించవచ్చు. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆటోమొబైల్, రవాణా, మెకానికల్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంలో ధనం విచ్చలవిడిగా వ్యయంచేస్తారు.
 
ధనస్సు:- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి.
 
మకరం:- ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పు కానవస్తుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ముఖ్యమైన విషయాలను గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.
 
కుంభం:- ఉపాధ్యాయులు విశ్రాంతిని పొందుతారు. సాహస ప్రయత్నాలు విరమించండి. వివాహ యత్నాలలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. అందరితో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. బంధువు రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి.
 
మీనం:- ఓర్పు, దీక్షతో అనుకున్నది సాధిస్తారు. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురువుతారు. వృత్తి, వ్యాపారాల యందు రాణింపు లభిస్తుంది. బంధువుల రాకతో మీ పనులు మందకొడిగా సాగుతాయి.