బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

ఈరోజు రాశి ఫలితాలు, ఎవరినీ అతిగా నమ్మవద్దు

Pisces
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు అధికం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా వ్యవహరిస్తారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. ఖర్చులు అంచనాలు మించుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. అకారణంగా మాటపడవలసి వస్తుంది. పనులు పురమాయించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనసహాయం తగదు. హోల్సేల్ వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగస్తులు పురస్కారాలు అందుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త పనులు ప్రారంభిస్తారు. సాయం ఆశించవద్దు. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలు ప్రశాంతంగా సాగుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలను అందుకుంటారు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. అపరిచితులతో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతిని సంప్రదిస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాగ్రత్త. వాహనదారులకు దూకుడు తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యాపారాలు బాగుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. పనివారలను ఓ కంట కనిపెట్టండి. బాధ్యతలు అప్పగించవద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఉపాధి పథకాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అవకాశాలు చేజారిపోతాయి. ఇదీ ఒకందుకు మంచికే. రావలసిన ధనం అందుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఉద్యోగస్తులకు పదవీయోగం. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారుం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులను సంప్రదిస్తారు. ఒత్తిళ్లకు గురికావద్దు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించి భంగపడతారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఖర్చులు విపరీతం. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవదర్శనంలో అవస్థలెదుర్కుంటారు.