గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-12-2022 శుక్రవారం దిన ఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజిస్తే...

Astrology
మేషం :- ఉద్యోగస్తులకు విధినిర్వహణలో తోటివారు సహాయ సహకారాలు అందిస్తారు. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. 
 
వృషభం :- బ్యాంకుల నుంచి పెద్దమొత్తం ధనం డ్రా చేసే విషయంలో మరొకరి సాయం తీసుకోవటం క్షేమదాయకం. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. ఎంతో కొంత పొదుపు చేద్దామన్న మీ యత్నం ఫలించక నిరుత్సాహం చెందుతారు. ఉద్యోగస్తుల కష్టాన్ని, చిత్తశుద్ధిని అధికారులు గుర్తిస్తారు.
 
మిథునం :- దంపతుల మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడతాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. ఇతరులను తక్కువగా అంచనా వేసి భంగపాటుకు గురవుతారు. హోటల్, బేకరీ, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకండి.
 
కర్కాటకం :- ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా వెలితిగా ఉంటుంది. స్త్రీల ప్రతిభా పాటవాలకు గుర్తింపు, తగిన అవకాశాలు లభిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆశించిన స్పందన ఉండదు. నిరుద్యోగులకు ఆశాజనకం. దూర ప్రయాణాలలో మెళుకువల అసవరం.
 
సింహం :- ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో తోటివారు సహాయ సహకారాలందిస్తారు. పట్టుదలతో శ్రమిస్తే అసాధ్యమనుకున్న పనులుపూర్తి కాగలవు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కన్య :- స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు అనుకూలం. ఉద్యోగస్తుల కష్టాన్ని, చిత్తశుద్ధిని అధికారులు గుర్తిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. ఎంతో కొంత పొదుపు చేద్దామన్న మీ యత్నం ఫలించక నిరుత్సాహం చెందుతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
 
తుల :- మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయా లేర్పడతాయి. మీ జీవిత భాగస్వామి సలహా మీకు ఎంతో సహకరిస్తుంది. కొన్ని వ్యవహాలు స్వయంగా మీరే చూసుకోవడం శ్రేయస్కరం. బ్యాంకు పనులు, దూరప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామి సలహా మీకు ఎంతో సహకరిస్తుంది.
 
వృశ్చికం :- ఆర్థిక, లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులు ప్రలోభాలకు లొంగరాదు. పత్రికా రంగంలోని వారికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వాహనం నడిపేటప్పుడు, అపరిచిత వ్యక్తులతో స్త్రీలకు మెళుకువ అవసరం. తొందరపాటు మాటలు, నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి.
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. స్త్రీలు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి చూపుతారు. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు ఫలిస్తాయి. ప్రియతముల ఆకస్మిక రాక ఆశ్చర్యానందాలు కలిగిస్తాయి. స్నేహితుల ద్వారా కొత్తవిషయాలు గ్రహిస్తారు.
 
మకరం :- గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఒక అవకాశం అనుకోకుండా కలిసివస్తుంది, తక్షణం సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ఆకస్మికంగా దూర ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
కుంభం :- వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పాత మిత్రుల కలియిక ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకండి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం.
 
మీనం :- ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. స్త్రీలకు బంధువుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదురవుతాయి. నూతన వ్యక్తులకు అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. దైవారాధన పట్ల ఆశక్తి పెరుగుతుంది.