గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-03-2023 తేదీ సోమవారం దినఫలాలు - ఈశ్వరుడిని పూజించి అర్చించినా మీకు శుభం...

Aries
మేషం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయమవుతుంది. సభలు, సమావేశాలు, వేడుకల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం, వస్తుప్రాప్తి వంటి శుభఫలితాలుంటాయి.
 
వృషభం :- వ్యాపారాలకు కావలసిన పెట్టుబడుల కోసం యత్నాలు సాగిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. రుణాల కోసం అన్వేషిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు అభివృద్ధి పొందుతారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమువుతాయి.
 
మిథునం :- దైవ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ, కళారంగాల వారికి యోగప్రదంగా ఉంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో చికాకులను ఎదుర్కొంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ ధ్యేయం నెరవేరుతుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. 
 
కర్కాటకం :- స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉపాధ్యాయుల సహనానికి తగిన బహుమతి లభిస్తుంది. ప్రియతములలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. బంధువుల రాకతో అనుకోని కొన్ని ఖర్చులు మీద పడతాయి. ఖర్చులు అధికమవుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
సింహం :- ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. వ్యాపారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. ధనం ఎంత వస్తున్నా పొదుపు చేయలేక పోతారు.
 
కన్య :- ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునప్పుడు జాగ్రత్త వహించండి. రాజకీయ, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు తీర్పులు మీకే అనుకూలంగా వచ్చే సూచనలున్నాయి. పెద్దమొత్తం ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. భాగస్వామికుల మధ్య పరస్పర అవగాహన కుదురుతుంది.
 
తుల :- ఆర్థిక వ్యవహరాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదావకాశాలు లభించగలవు. అతిధి మర్యాదలతో అందరినీ ఆకట్టుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలుసుకుంటారు. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది.
 
వృశ్చికం :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. ఆటోమోబైల్, ట్రాన్స్‌పోర్టు రంగాలలో వారికి జయం, శుభం చేకూరుతుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. పెద్ద మొత్తంలో స్టాక్ ఉంచుకునే విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. 
 
ధనస్సు :- బంధువుల రాకపోకలు అధికమవుతాయి. స్త్రీలు ప్రముఖల సిఫార్సుతో దైవదర్శనాలను తొరగా ముగించుకుంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. శారీరిక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. కొబ్బరి, పానీయ, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం.
 
మకరం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి పురోభివృద్ధి పొందుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చుతప్పులు పడుట వల్ల మాటపడక తప్పదు.
 
కుంభం :- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. మీ అభిప్రాయం చెప్పటానికి సందర్భం వస్తుంది. హోటలు తినబండ వ్యాపారులకు కలిసివచ్చేకాలం. స్త్రీలు అధికారులతో వీలైనంత వరకు మితంగా సంభాషించడం మేలు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
 
మీనం :- ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నం వాయిదా వేయండి. అనవసరపు సంభాషణల వల్ల ముఖ్యులతో ఆకస్మిక భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది. రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలోని వారికి ఓర్పు, అంకితభావంతో పనిచేసి మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు. దుబారా నివారించ లేకపోవడం వల్ల ఆందోళన తప్పదు.