బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-12-2023 బుధవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల సర్వదా శుభం...

Weekly Horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర శు॥ తె.4.02 జ్యేష్ఠ ప.12.01 రా.వ.7.51 ల 9.26. ప. దు. 11. 28 ల 12.12.
ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సినిమా, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది.
 
వృషభం :- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. స్థిరాస్తి విక్రయానికి ఆటంకాలు తొలగిపోగలవు. రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్నివిధాలా గుర్తింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకొని తప్పటడుగు వేస్తారు.
 
మిథునం :- ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమంచి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. మీ మిత్రుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు అయిన వారి ఆరోగ్యం కలవరపరుస్తుంది. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం :- స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి అధికమవుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. పాత వస్తువులను కొనిసమస్యలు తెచ్చుకోకండి. అందరితో సఖ్యతగా మెలుగుతూ ఉల్లాసంగా గడుపుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సదావకాశాలు లభిస్తాయి.
 
సింహం :- వ్యాపారస్థులు అధిక శ్రమని, ఒత్తిడిని ఎదుర్కొనవలసి వస్తుంది. బంధువులను కలుసుకుంటారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగువేస్తారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు.
 
కన్య :- ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనా లోపం. సోదరులతో ఏకీభవించ లేకపోతారు. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ రంగాల్లో వారికి పురోభివృది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.
 
తుల :- రవాణా, ఎక్స్‌పోర్టు రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. స్త్రీలకు ఇంటి వాతావరణం చికాకు కలిగిస్తుంది. ధనం ఏ మాత్రం ఆదా చేయలేకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి తప్పవు.
 
వృశ్చికం :- సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులు ఎదటివారితో మితంగా సంభాషించటం ఉత్తమం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసిరాగలవు. ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనా లోపం. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
ధనస్సు :- వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి. మిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత పొందుతారు. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి అధికమవుతుంది. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుతాయి.
 
మకరం :- బంధువుల రాకతో ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులుపై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ప్రయత్నపూర్వకంగా మొండి బాకీలు వసూలుకాగలవు.
 
మీనం :- భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా సాగుతాయి. ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. సోదరీ సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయంచేస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలత్తుతాయి.