గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-01-2023 సోమవారం దినఫలాలు- ఉమాపతిని ఆరాధించినట్లైతే..?

Astrology
ఉమాపతిని ఆరాధించిన శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం:– ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ లేఖలు అందుతాయి. నూతన వ్యాపారాలు, సంస్థలు, పరిశ్రమల స్థాపనలకు కావలసిన అనుమతులు మంజూరు కాగలవు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
వృషభం :- ఉన్నత స్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి అశాజనకం. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. క్రయ విక్రయాలు లాభదాయకంనూతన వ్యాపారాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. 
 
మిధునం:- ఆర్ధిక వ్యవహారాలు ప్రోత్సాహాన్నిస్తాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయంచేస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు సవాలుగా నిలుస్తాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ప్రతి విషయంలోను ప్రణాళికాబద్ధంగావ్యవహరిస్తారు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది, మెలకువ వహించండి. 
 
కర్కాటకం: – గృహనిర్మాణాలు, మరమ్మతులు సంతృప్తికరంగా సాగుతాయి. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగాల వారికి అశాజనకం. నిరుద్యోగులకు బోగన్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. స్త్రీలు క్రీడలు, కళాత్మక పోటీలలో విజయంసాధిస్తారు. 
 
సింహం:- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు పని వారలతో చికాకులు తప్పవు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి.
 
కన్య: – నూతన సంస్థలకు కావలసిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఒకస్థిరాస్తి విక్రయించాలనేమీ ఆలోచన వాయిదా వేయటం మంచిది. స్త్రీలకు వస్త్రలాభం, వస్తు ప్రాప్తి వంటి శుభఫలితాలుంటాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆందోళన తప్పవు. విద్యార్థినులు ఆకర్షణలు, ఒత్తిడికి దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
తుల:- కిరాణా, ఫాన్సీ, వస్త్ర, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి. విద్యార్థులు ఆలోచనలుపక్కదారి పట్టే అస్కారం ఉంది. వృత్తుల వారికి అన్నివిధాలా కలిసిరాగలదు. ఉద్యోగస్తుల శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తిస్తారు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి.
 
వృశ్చికం:- కుటుంబీకులు మీ పరిస్థితిని అర్ధం చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేస్తారు. స్త్రీలు కళాత్మక పోటీల్లో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనేకచికాకులు ఎదురవుతాయి. ఓర్పు, పట్టుదలే ధ్యేయంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఖర్చులు పెరిగినా సంతృప్తికరంగా ఉంటాయి.
 
ధనస్సు:- సన్నిహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఆసక్తిమరింత పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.
 
మకరం:- గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. దూర ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతకి తోడ్పడతాయి. చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. క్రయ విక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
కుంభం:- సభలు, సమావేశాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.స్థిరచరాస్తుల విషయంలో కుటుంబీకుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. రావలసినధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. నూతన కాంట్రాక్టుల విషయంలో పునరాలోచనఅవసరం.
 
మీనం:- ఖర్చులు, చెల్లింపుల విషయంలో ఏకాగ్రత వహించండి. కుటుంబీకులతో ఉత్సాహంగా గడుపుతారు. మిత్రుల నుంచి కావలసిన సమాచారం లభిస్తుంది. కార్యసాధనలో జయం పొందుతారు. ప్రత్యర్థులు వేసే పథకాలు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు అమలుచేస్తారు.