1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులకు అనుకూలం. ప్రలోభాలకు లొంగవద్దు, న్యాయ నిపుణుల సలహా తీసుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు. కొత్త యత్నాలు మొదలెడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టం ఫలిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆప్తులకు సాయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పత్రాలు జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. దుబారా ఖర్చులు అధికం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణ సమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. పత్రాలు అందుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. వాగ్ధాటితో రాణిస్తారు. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. బాధ్యతలు అధికమవుతాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు విపరీతం. రావలసిన ధనం అందదు. రోజులు భారంగా గడుస్తున్నట్టు అనిపిస్తాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. అర్భాటాలకు అతిగా వ్యయం చేస్తారు. పిల్లల మొండివైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. పనులు వాయిదా పడతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పత్రాల సవరణల్లో ఏకాగ్రత వహించండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆచితూచి వ్యవహరిచండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకులను సంప్రదిస్తారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అనుకూలతలున్నాయి. సమర్ధతను చాటుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. పిల్లల దూకుడు అదుపు చేయండి. విందుకు హాజరవుతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రతి విషయంలోనూ మీదే పైచేయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. అభియోగాలు తొలగిపోగలవు. పురస్కారం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆలోచనతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. లక్ష్యం సిద్ధిస్తుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.