బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-11-2024 ఆదివారం ఫలితాలు - ఆ రాశివారు అప్రమత్తంగా ఉండాలి...

astro6
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
చాకచక్యంగా అడుగులేస్తారు. మీ నమ్మకం ఫలిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆహ్వానం అందుకుంటారు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2, పాదాలు
రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మాట నిలబెట్టుకుంటారు. గౌరవమర్యాదలు పెంపొందుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఓర్పుతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. మానసికంగా కుదుటపడతారు. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికలావాదేవీలు ఫలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. లక్ష్యం నెరవేరుతుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొత్త వ్యక్తులతో వాగ్వాదాలకు దిగివద్దు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబసౌఖ్యం పొందుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆచితూచి అడుగేయాలి. మీ పొరపాట్లు సరిదిద్దుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. రావలసిన ధనం అందుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. లావాదేవీలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అధికం. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఊహించని సంఘటనలెదురవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. నోటీసులు అందుకుంటారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆగిపోయిన పనులు ప్రారంభిస్తారు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ధైర్యంగా యత్నాలు సాగించండి. సన్నిహితులు సాయం అందిస్తారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కీలక పత్రాలు అందుతాయి. పిల్లల అత్యుత్సాహం అదుపు చేయండి. ప్రియతములతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.