శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు॥ ద్వాదశి రా.10.44 పుబ్బ ప.2.26 రా.వ.10.25 ల 12.12. ఉదు. 5.55 ల 7.33.
 
మేషం :- కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ప్రకటనల విషయంలో అప్రమత్తత చాలా అవసరం. చేపట్టినపనులు అనుకున్నంత చురుకుగా సాగవు. స్త్రీలు అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
వృషభం :- ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాలవారికి శుభం చేకూరుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. కొత్త పనులు ప్రారంభిచడంలో అడ్డంకులు ఎదురవుతాయి. వాహనం వీలైనంతనిదానంగా నడపటం మంచిది.
 
మిథునం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. విదేశాలలో నిక్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. మీ ఉన్నతిని చాటుకోవటం కోసంధనం విరివిగా వ్యయం చేయవలసివస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూ లేఖలు అందుకుంటారు. మీ అభిప్రాయాలకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభించలేకపోతారు.
 
కర్కాటకం :- వ్యాపారాల్లో శ్రమించిన కొలదీ లాభాలు గడిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. నూతన పెట్టుబడులకు మరికొంత కాలం వేచియుండటం ఉత్తమం. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
సింహం :- ఉద్యోగస్తులు, రిప్రజెంటివ్‌లు మార్పులకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. దైవకార్యాలు, ఆధ్యాత్మిక కారక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా శ్రమించి మీ పనులు సకాలంలో పూర్తిచేస్తారు. స్త్రీలకు ఆరోగ్యభంగం, నీరసం వంటి చికాకులు తప్పవు. ముఖ్యుల రాకపోకలు, ఊహించని ఖర్చులు ఎదుర్కోకతప్పదు.
 
కన్య :- వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమించి లాభాలు గడిస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాదులందు శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తిమరింత బలపడుతుంది. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటారు. విలాసాలకు ధనం బాగా వెచ్చిస్తారు. ఒప్పందాలు, రవాణా వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి.
 
తుల :- కొనుగోళ్ళ విషయంలో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్ త్వరలోనే అందుతుంది. సర్దుబాటు ధోరణితోనే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రముఖుల ప్రేమయంతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును అధికారులు గుర్తిస్తారు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆపత్సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు.
 
ధనస్సు :- విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రకటనలు, రాజకీయ కళారంగాల వారికిప్రోత్సహకరం. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలకు ప్రయాణాలలో మెళకువ అవసరం.
 
మకరం :- ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు. రాజీమార్గంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపార రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు అన్నివిధాలా కలిసివస్తుంది. న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు.
 
కుంభం :- అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. రాజకీయ నాయకుల కదలికలపై విద్రోహులు కన్నేసిన విషయం గమనించండి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి.
 
మీనం :- కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మీరాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. విదేశాలు వెళ్ళాలనే మీ కొరిక త్వరలోనే నెరవేరబోతోంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాల్లో లౌక్యం అవసరం.